Kannappa Teaser: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న మూవీ ‘కన్నప్ప’. ముకేశ్ కుమార్ సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, మధుబాల వంటి స్టార్స్ అందరూ ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఇలా ఎంతో మంది సూపర్ స్టార్స్ నటిస్తుండంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ సినీ ప్రేక్షకులను అలరించాయి. ఇక చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Also Read: తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 హోస్టుగా క్రేజీ హీరో?
ఇక టీజర్‌లో చూస్తే.. కన్నప్ప ప్రపంచం ఎలా ఉంటుందనే బాగా చూపించారు. ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న నటుల పాత్రలు అన్ని చూపించారు. 1:24 నిమిషాల ఉన్న ఈ టీజర్‌లో మంచు విష్ణు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్ రోల్స్ అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్ ఎంట్రీ నుంచి చివరకు వరకు సూపర్ ఉంది. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతి దేవిగా కాజల్ పాత్రతో పాటు మోహన్ లాల్, మోహన్ బాబు సహా పలు పాత్రల్లో అలరిస్తున్నారు. ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అన్నీ ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ టు ఎండ్ అదుర్స్ అనే చెప్పాలి. అయితే నాస్తికుడు.. శివయ్య భక్తుడిగా ఎలా మారాడు అనేదే కథ అని తెలుస్తోంది. ఇక మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని సినీ ప్రేక్షకులు అంటున్నారు.
Also Read: సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అంటున్న సీనియర్ హీరోయిన్
న్యూజిలాండ్ పారెస్ట్‌లతో పాటు రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ వేసి ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు. రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాదే ఏప్రిల్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శ్రీకాళహస్తిలో ఉంటుందని హీరో విష్ణు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై మంచు విష్ణు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎంతోకాలంగా ఓ మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలనే తపనతో మైథలాజికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.