kiccha sudeep
ఎంటర్‌టైన్మెంట్

Max on OTT: మ్యాక్స్ కాదిది మ్యాడ్ ‘మ్యాక్స్’

Max on OTT: గతేడాది థియేటర్‌లలో రిలీజైన థ్రిల్లింగ్ యాక్షన్-ప్యాక్డ్, హై-ఆక్టేన్ డ్రామా ‘మ్యాక్స్’. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన ఈ సినిమా గత ఏడాది కన్నడ సినీ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ గ్రాసర్ గా రికార్డ్ సృష్టించింది. సుదీప్ మాస్ అవతార్ లో కనిపించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, సుకృతా వాగ్లే, సునీల్, అనిరుధ్ భట్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా రిలీజైన ఈ సినిమా ఓటీటీ అప్డేట్ అందరిని ఎగ్జైట్ చేస్తోంది.

Also Read- Nag Ashwin X Alia bhatt: పాన్ ఇండియాకు దారి ఇదేనా..

ప్రేక్షకుల నుంచి ‘మాస్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్’గా టాక్ పొందిన ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ 5(ZEE5) సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 15 నుంచి కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో ప్రీమియర్ చేయనున్నట్లు ప్రకటించారు. విడుదలైన ప్రతి చోటు నుండి ట్రెమెండస్ టాక్ ని పొందిన ఈ సినిమాని ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేసే వారందరికీ జీ5 గుడ్ న్యూస్ చెప్పింది.

ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల సందర్భంగా హీరో కిచ్చా సుదీప్ మాట్లాడుతూ..‘మ్యాక్స్‌’ మూవీ ZEE5లో స్ట్రీమింగ్ కానుండటం నాకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా థియేటర్లలో విడుదలైనప్పటి నుండి అభిమానులు, ఆడియెన్స్‌ ఎంతో ప్రేమ చూపిస్తూ వస్తున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ అర్జున్ మహాక్షయ్ పాత్రలో నటించడం గొప్ప అనుభవం. యాక్షన్, ఎమోషన్, ఇంటెన్స్ డ్రామాతో నిండిన ఈ మూవీ ఇప్పుడు జీ5లో అందరికీ అందుబాటులో వచ్చేస్తుంది. ‘మ్యాక్స్’ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌ నన్ను చాలా ఎగ్జైట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మరింత ఎక్కువ మందికి సినిమా చేరుతుందని నేను ఆశిస్తున్నానని అన్నారు.

ఇవి కూడా చదవండి: 

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ‘వాలెంటైన్స్ డే’ సర్‌‌ఫ్రైజ్‌ చూశారా..

Janhvi Kapoor X Pa. Ranjith: శభాష్.. బోల్డ్ స్టెప్ వేసిన జాన్వీ

Just In

01

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు