Vikram 4K Re-Release: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ 71వ పుట్టినరోజున అభిమానులకు అమూల్యమైన బహుమతి సిద్ధం చేశారు. ఆయన పుట్టిన రోజు అయిన నవంబర్ 7న తన సూపర్ హిట్ సినిమా విక్రమ్ సినిమా రీ రిలీజ్ చేయనున్నారు. 2022లో విడుదలై కమల్ హాసన్ కెరీర్ లో భారీ విజయం సాధించిన యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ థియేటర్లలో మళ్లీ రానుంది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం, కమల్ ఫ్యాన్స్‌లో అపార ఆదరణ పొందుతోంది. ఈ రీరిలీజ్‌తో ‘ఉలగనాయగన్’ లెగసీ మరోసారి ప్రకాశవంతమవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Read also-Shiva 4K Trailer: ‘శివ’ రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది చూశారా.. ఏంటి భయ్యా ఆ ర్యాంపేజ్..
జూన్ 3, 2022న విడుదలైన ‘విక్రమ్’, తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమల్ హాసన్ ‘విక్రమ్’ పాత్రలో ఆకట్టుకున్నారు. విజయ్ సేతుపతి ‘సందేశ్’గా, ఫహద్ ఫాసిల్ ‘రోలెక్స్’గా మెప్పించుకున్నారు. చివర్లో సూర్య సర్ప్రైజ్ కెమియోతో సినిమా ట్విస్ట్‌లు అద్భుతంగా జోడించారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌లో రికార్డులు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లు మించి వసూళ్లు చేసింది. ఇది కమల్ హాసన్ కెరీర్‌లోనే అత్యంత విజయవంతమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. యాక్షన్ సీక్వెన్స్‌లు, డైలాగ్స్, బీజీఎమ్ లతో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ మూవీ, ఇప్పుడు మళ్లీ పెద్ద స్క్రీన్ మ్యాజిక్‌ను అందించనుంది.
Read also-Supreme Court: మల్టీప్లెక్సులపై సీరియస్ అయిన సుప్రీం కోర్ట్.. ఎందుకంటే?
The Ulaganayagan Birthday Blast is Here! 💥
Bookings Open now for #KamalHaasan garu’s MASSive Blockbuster #VIKRAM 8 AM Special Show on Nov 7th @ Mythri Vimal 70MM, Balanagar 🔥🔥🎟️ BOOK NOW: https://t.co/4no7kaNYD2#MythriTheatres pic.twitter.com/52hgtjE4FJ
— Mythri Theatres (@MythriTheatre) November 3, 2025
