kalpana rai
ఎంటర్‌టైన్మెంట్

Kalpana Rai: క‌ల్ప‌నా రాయ్‌ని మోసం చేసింది కూతురే!

Kalpana Rai: తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది కమెడియన్స్ తమదైన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్‏తో సినీ ప్రియులను అలరించారు. వందలాది సినిమాల‌లో లేడి క‌మెడీయ‌న్‌గా న‌టించి మెప్పించిన వారిలో క‌ల్ప‌నా రాయ్ ఒకరు. తనదైన యాస, కామెడీ పంచులతో ప్రేక్షకులను నవ్వించింది. దాదాపు 430కు పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మధుమాసం, పుట్టింటికి రా చెల్లి, ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ప్రియమైన నీకు, బాచి, కలిసుందాం రా, పాపే నా ప్రాణం, జంబలకిడి పంబ వంటి చిత్రాల్లో నటించి అలరించింది. ఎన్నో చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. చివరి రోజుల్లో మాత్రం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడింది. చివరి రోజుల్లో ఆకలితో అలమటించి ప్రాణం విడిచింది. 2008వ సంవత్సరంలో హైదరాబాద్‌లో ఇందిరానగర్‌లో తుది శ్వాస విడిచింది.

కల్పనా రాయ్.. అసలు పేరు సత్యవతి. కాకినాడలో కల్పనా రాయ్ జన్మించింది. సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆమె పేరు కల్పనగా పెట్టుకుంది. మోహన్ రాయ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడంతో కల్పనా రాయ్‌గా మారింది. వీరికి ఒక కుమార్తె ఉంది. ఇక సీనియర్ నటి శారద సహాయంతో సినీ పరిశ్రమలోకి కల్పనా రాయ్ వచ్చింది. కల్పనా రాయ్‌కి నటి శారద అంటే చాలా ఇష్టం.. అభిమానం కూడా. డైరెక్టర్ కోడి రామకృష్ణ, విక్టరీ వెంకటేష్ చిత్రాల్లో ఎక్కువ ఛాన్స్‌లు వచ్చాయి. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసింది. ఇక ఆమె యుక్త వయస్సులో ఉన్నపుడు చాలా అందంగా ఉండేది. మూవీ సెట్ లో అందరిని నవ్విస్తూ.. అటుపడుతూ ఉండేది. సెట్‌లో అందరికి కడుపు నిండా అన్నం పెట్టేదేట. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకునేదట. ఆమె మంచి తనమే చివరి రోజుల్లో శాపంగా మారింది. ఆమెను పట్టించుకునే నాథుడే లేడు.

Also Read: ఆ హీరోయిన్‌ని చూసే అది నేర్చుకున్నా: అనన్యా పాండే

ఇక ఉన్న ఏకైక కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తల్లి మాట వినకుండా వెళ్లిపోయింది. ఇక అప్పటి నుంచి తల్లిని పట్టించుకోలేదు. ఇంటికి రావడమే బంద్ చేసింది. దీంతో కల్పనా రాయ్ ఒంటరిగా జీవించాల్సి వచ్చింది. ప్రాణంగా పెంచుకున్న కుమార్తె అలా తనను మోసం చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో మానసిక క్షోభకు గురైంది. ఇక చివరి రోజుల్లో ఆమె దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు.ఆ మెనూ దగ్గర తీసేవారే కరువయ్యారు. ఆమెకు తిండి పెట్టే వారే లేరు. చివరికి అనాథగా ఆమెకు దహన సంస్కరణలు చేసారు.

 

 

Just In

01

Bengaluru: భార్యపై అనుమానం.. కూతురు చూస్తుండగానే బస్టాప్‌లో చెప్పలేని దారుణానికి ఒడిగట్టిన భర్త

Pawan Kalyan: ఓజీ రిలీజ్ సమయంలో తెర పైకి పవన్ డిజాస్టర్ మూవీ.. ఎక్కడో తేడా కొడుతోంది?

Mahabubabad District: తొర్రూరు మున్సిపాలిటీలో వివాదం.. శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు?

Pak Army vs People: పాక్ ఆర్మీపై తిరగబడ్డ ప్రజలు. తమ పిల్లలు ఉగ్రవాదులా అంటూ ఫైర్!

Damodar Rajanarsimha: ఎన్ని అడ్డంకులు వచ్చినా రోడ్డు వెడల్పు చేయాల్సిందే: మంత్రి దామోదర రాజనర్సింహ