junior-ott( image :x)
ఎంటర్‌టైన్మెంట్

Junior movie OTT: గాలి కిరీటి ‘జూనియర్’ మూవీ ఓటీటీ డేట్‌‌లో మార్పు.. ఈ సారి కన్ఫామ్.. ఎప్పుడంటే?

Junior movie OTT: గాలి కిరీటి హీరోగా, డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ‘జూనియర్’ (Junior Movie) సినిమా థియేటర్లలో ఓకే అనిపించుకుంది. అయితే థియోటర్లలో చూడని ప్రేక్షకులు ఓ టీటీలో చూసేందుకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రముఖ ఓటీటీ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాను ఆహా లో సెప్టెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది అని తెలిపింది. ఎందుకో ఈ సినిమా సెప్టెంబర్ 22న ఓటీటీలో విడుదల కాలేదు. తాజాగా ఆహా ఓటీటీ సంస్థ మరో తేదీని ప్రకటించింది. ఈ సారి సెప్టెంబర్ 30 ఖచ్చితంగా ఓటీటీలోకి వస్తుందని ప్రకటించింది. ఈ సినిమాను చూసేందుకు కిరీటి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మాములుగా అయితే ఈపాటికే ఈ సినిమా ఓటీటీలో సందడి చేయాలి. కానీ, రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. దసరా పండుగను పురస్కరించుకుని, ఈ సినిమాను ఓటీటీలోకి విడుదల చేస్తున్నారు ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’.

Read also-Meenakshi Natarajan: తెలంగాణలో ఏఐసీసీ టాస్క్ ఇదే.. అక్టోబర్ 15 నాటికి పూర్తి చేసేలా టార్గెట్!

ఈ సినిమాలోని ‘వైరల్ వయ్యారి’ పాట ఓ ఊపు ఊపేసిన విషయం తెలియంది కాదు. ఈ పాట కోసం సినిమా చూసిన వాళ్లు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ పాటలో శ్రీలీలతో హీరో కిరీటీ కూడా అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఈ పాట ఇప్పటికీ వినబడుతూనే ఉందంటే.. పాటకున్న పవర్, శ్రీలీల గ్లామర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే అంటుంది.. ఈ దసరాకు శ్రీలీల అభిమానులకు పండగే అని. అవును.. దసరా ఫెస్టివల్‌ను పురస్కరించుకుని.. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ఆహా ఓటీటీ (Aha Ott)లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓటీటీ రైట్స్‌ని ఆహా ఓటీటీ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాతో బొమ్మరిల్లు జెనీలియా సౌత్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read also-OG release hurdles: విడుదలకు ముందు ‘ఓజీ’పై జరుగుతున్న ఆ కుట్రలు నిజమేనా?.. ఎందుకంటే?

‘జూనియర్’ కథ విషయానికి వస్తే.. అభి (కిరీటి)కి తన లైఫ్‌ని స‌ర‌దాగా లీడ్ చేయాలని ఉంటుంది. ఈ క్రమంలో అతను స్ఫూర్తి (శ్రీలీల‌) అనే అమ్మాయిని ఇష్ట‌ప‌డ‌తాడు. స్ఫూర్తి ప్రేమించడానికి, ఆమె ప్రేమను పొందడానికి, ఆమె ప‌ని చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ కంపెనీ బాస్ విజ‌య సౌజ‌న్య (జెనీలియా).. అభిని అనుక్షణం ద్వేషిస్తుంటుంది. విజయ సౌజన్యకు, అభికి ఉన్న సంబంధం ఏమిటి? ఆమెతో క‌లిసి అభి విజ‌య‌న‌గ‌రం ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చిందనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథ. రాధా కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ‘బాహుబలి’ ఫేమ్ సెంథిల్ సినిమాటోగ్రఫీ అందించగా, సాయి కొర్రపాటి నిర్మించారు. మరి థియేటర్లలో ఆడియెన్స్ ఆదరణను రాబట్టుకోలేకపోయిన ఈ సినిమా, ఓటీటీలో ఎలాంటి ఆదరణను పొందుతుందో చూడాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ని ఆహా ప్రకటించనుంది.

Just In

01

Canara Bank Recruitment 2025 : కెనరా బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025

OG Premier: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ప్రీమియర్ షో పడేది ఎప్పుడో తెలుసా?.. ఎక్కడంటే?

Government Complex: ఖాళీగా దర్శనమిస్తున్న మార్కెట్ యార్డ్ ప్రభుత్వ షాపులు.. దృష్టి సారించని అధికారులు

Ambati Rambabu comments: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాపై అంబటి రాంబాబు కామెంట్స్ వైరల్.. ఏమన్నాడంటే?

Accenture Campus: ఏపీకి గుడ్ న్యూస్.. 12వేల ఉద్యోగాలతో.. టాప్ గ్లోబల్ కంపెనీ వచ్చేస్తోంది!