Jr NTR: హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)కు ప్రమాదం సంభవించి, స్వల్ప గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తారక్.. ‘కెజియఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు టైటిల్‌గా ‘డ్రాగన్’ (Dragon) అని అనుకుంటున్నారు. ఇంకా పేరు ఫైనల్ చేయలేదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌కు యాక్సిడెంట్ జరిగింది ‘డ్రాగన్’ షూట్‌లో కాదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ యాడ్ షూట్‌లో చిన్న యాక్సిడెంట్ జరిగి, జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలైనట్లుగా టాక్ వినబడుతోంది. వెంటనే టీమ్ ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారని, గాయం తీవ్రమైనది కాదని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు నిర్ధారించినట్లుగా టాక్. దీంతో షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఇంత వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
Also Read- Vijay Deverakonda: ఎవరి సలహాలు వినాల్సిన పనిలేదు.. బండ్లకు కౌంటర్! ఇదెలా మిస్సయ్యారు?
ఎన్టీఆర్ క్షేమంగానే ఉన్నారు
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్స్ సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్‌కు ప్రమాదం అనగానే, ఆయన అభిమానులు ఆందోళన చెందడం సహజమే. ఎవరూ ఆందోళన చెందవద్దని, ఎన్టీఆర్ క్షేమంగానే ఉన్నారని టీమ్ స్పష్టం చేసిందని అంటున్నారు. ఈ మధ్య ఎన్టీఆర్ కొన్ని బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వాటికి సంబంధించి ఓ వాణిజ్య ప్రకటన నిమిత్తం ఆయన యాడ్ షూట్‌లో పాల్గొనగా, అక్కడ చిన్న ప్రమాదం సంభవించిందనేలా వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా అప్డేట్ (ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అధికారిక ప్రకటన)
ఈ ప్రమాదంపై తాజాగా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ రోజు ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్‌కు స్వల్ప గాయం అయింది. వైద్యుల సలహా మేరకు, ఆయన పూర్తిగా కోలుకోవడానికి రాబోయే రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ తెలియజేస్తున్నాము. అభిమానులు, మీడియా, ప్రజలు ఎలాంటి ఊహాగానాలకు తావు ఇవ్వవద్దని మేము వినయపూర్వకంగా కోరుతున్నాము.. అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ లెక్కలన్నీ ఎన్టీఆర్ సరిచేస్తాడని భావిస్తున్నారు. అందులోనూ ‘దేవర’ తర్వాత చేసిన ‘వార్ 2’ చిత్రం ఫ్లాప్ కావడంతో.. అభిమానులంతా ‘డ్రాగన్’పైనే నమ్మకం పెట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత ‘దేవర 2’ షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు