Janam Movie Re Release
ఎంటర్‌టైన్మెంట్

Janam Re Release: ‘జనం’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏం డేర్ సామి నీది?

Janam Re Release: ఈ మధ్య అన్ని సినిమా ఇండస్ట్రీలలో నడుస్తున్న ట్రెండ్ ఏంటయ్యా అంటే ‘రీ రిలీజ్’. స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు.. వారు నటించిన ఓల్డ్ సినిమాలను సరికొత్తగా ముస్తాబు చేసి థియేటర్లలో వదులుతున్నారు. ఇది కొన్ని సినిమాలకు బాగానే వర్కవుట్ అవుతుంది. ఇంకొన్ని సినిమాలు అయితే, మొదటిసారి రిలీజ్ అయినప్పటి కంటే, రీ రిలీజ్ అయినప్పుడే మంచి ఆదరణ, కలెక్షన్స్ రాబడుతుండటం విశేషం. రామ్ చరణ్ ‘ఆరెంజ్’ సినిమా ఇలానే రీ రిలీజ్‌లో అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. ఇటీవల క్లాసిక్ చిత్రాలు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ‘ఆదిత్య 369’ వంటి చిత్రాలు రీ రిలీజైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలు రీ రిలీజ్‌లో అంతగా ఆదరణ రాబట్టుకోలేదనే చెప్పుకోవాలి. మరి ఇలాంటి క్లాసిక్‌ల పరిస్థితే ఇలా ఉంటే, ఇప్పుడో దర్శకనిర్మాత ఓ చిన్న చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తూ.. పెద్ద సాహసమే చేస్తున్నారు. ఆ నిర్మాత మరెవరో కాదు.. వెంకటరమణ పసుపులేటి.

Also Read- Naveen Chandra: నా ప్రతి సినిమాకు 10 మందైనా పెరగాలి.. అదే నా గోల్!

వీఆర్‌పీ క్రియేష‌న్స్ ప‌తాకంపై, పి.ప‌ద్మావ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో సుమ‌న్, అజ‌య్ ఘోష్, కిషోర్, వెంక‌టర‌మ‌ణ‌, ప్ర‌గ్య‌ నైనా ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘జ‌నం’. వెంక‌టర‌మ‌ణ ప‌సుపులేటి స్వీయ‌ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ మూవీని మే 29న రీ-రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. రాజకీయాలను, రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఘాటైన చర్చను రాజేసిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ 10న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణనే రాబట్టుకుంది. సమాజంలోని పౌరులను పక్కదారి పట్టిస్తున్న ఘటనలను ఎత్తి చూపిస్తూ, అందరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో దర్శకుడు వెంకటరమణ చేసిన ఈ ప్రయత్నం మరోసారి ప్రేక్షకులలో రిజిస్టర్ చేయించాలని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసి, వెంకటరమణ డేర్‌ని అంతా ప్రశంసిస్తున్నారు.

Also Read- Vachinavaadu Gautam Teaser: ధర్మం దారి తప్పినప్పుడు.. ఏ అవతారం రానప్పుడు.. వచ్చినవాడే!

ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా దర్శకనిర్మాత వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ.. అదుపు త‌ప్పుతున్న నేటి త‌రానికి అవ‌గాహ‌న కల్పించేలా మంచి సినిమా తీశాం. ఈ సినిమా మళ్లీ మళ్లీ ప్రేక్షకులలోకి తీసుకెళితే.. ఒక్కరిలోనైనా మార్పు వస్తుందనేది మా అభిప్రాయం. సమాజంలో ఉత్త‌మ పౌరులుగా ఉండాల్సిన నేటి తరం.. స్మార్ట్‌ ఫోన్‌కు, నాయకుల పంచే మందు, డ‌బ్బుల‌కు ఎలా బానిస అవుతున్నారో ఆలోచింప‌జేసేలా ఈ సినిమా ఉంటుంది. ఒకప్పుడు సినిమాలు జనాన్ని ఆలోచింపజేసే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడలా లేవు. కంటి చూపుతో విమానాలు కూలటం, రక్త పాతం, హింస, బీపీలు పెరిగే సౌండ్, అర్థం లేని సినిమాలు, వేల కోట్ల కలెక్షన్స్. సమాజాన్ని, రేపటి తరాన్ని ఎటు తీసుకెళుతున్నామో ఒక్కరికైనా అర్థమవుతుందా? అందుకే ఈ నెలలో విడుదలకు వస్తున్న ‘జనం’ సినిమా అందరూ చూడాలని కోరుతున్నాను. ఇది ఓటీటీకి ప్లాన్ చేయ‌డం కోసం చేస్తుంది కాదు. ఈ సినిమాకు సుమ‌న్ హీరో. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించారు. ఇందులో క‌మ‌ర్షియ‌ల్ అంశాలు, సందేశం, సెంటిమెంట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. మే 29న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాను చూసిన వారు మరోసారి చూడాలని, చూడని వాళ్లు మిస్ కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?