Jana Nayagan: తమిళ ఇండస్ట్రీతో పాటు సౌత్ ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘జన నాయగన్’ (Jana Nayagan). దళపతి విజయ్ (Kollywood Star Hero Vijay) తన పొలిటికల్ ఎంట్రీ నిమిత్తం చేసిన చివరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ చేరిన వివాదాలు, విడుదల వాయిదాలు చూస్తుంటే.. అటు అభిమానులకు, ఇటు చిత్ర యూనిట్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) పరిస్థితి ఇప్పుడు ‘పాపం’ అనేలా మారిపోయింది. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ, అనూహ్యంగా ఈ సినిమా సెన్సార్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగులు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేసేలా ఉన్నాయని, అందుకే కొన్ని రాజకీయ శక్తులు కావాలనే అడ్డుకుంటున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, కోర్టు విచారణల మధ్య సినిమా విడుదల ఎప్పుడు అనేది చెప్పడం కష్టంగా మారింది. విజయ్ కెరీర్లో ‘లాస్ట్ మూవీ’గా ప్రచారం జరుగుతున్న చిత్రానికి ఇలాంటి అడ్డంకులు ఎదురవ్వడం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది.
Also Read- Sankranthi Movies: సంక్రాంతి సినిమాలు.. మండే టెస్ట్‌లో నిలిచే సినిమా ఏది?
పూజా హెగ్డే ఆశలన్నీ అడియాశలాయే
ఫ్యాన్స్ మాత్రమే కాదు.. హీరోయిన్ కూడా తీవ్ర నిరాశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా, గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే, ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ‘అల వైకుంఠపురములో’ వంటి ఇండస్ట్రీ హిట్ చూసిన ఈ బ్యూటీకి, గత ఏడాది కాలంగా అదృష్టం కలిసి రావడం లేదు. పెద్ద సినిమాలు చేజారిపోవడం, నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఆమె కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. టాప్ హీరోయిన్ స్టేటస్ నుంచి స్పెషల్ సాంగ్స్ చేసే స్థాయికి ఆమె పరిమితమైంది. అలాంటి సమయంలో ‘జన నాయగన్’ ఆమెకు ఒక లైఫ్ లైన్ లాంటిది. దళపతి విజయ్ సినిమా, అది కూడా సంక్రాంతికి విడుదల అంటే ఆమె రేంజ్ మళ్ళీ పెరగడం ఖాయమని భావించింది. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ కోలీవుడ్, టాలీవుడ్లో బిజీ అవుతానని వెయ్యి కళ్లతో ఎదురు చూసింది. కానీ, మనమొకటి తలస్తే.. దైవం ఇంకోటి తలుస్తుంది అన్నట్లుగా సినిమా ఆగిపోవడంతో పూజా హెగ్డే ఆశలన్నీ నీరుగారిపోయాయి.
Also Read- Dhanush and Mrunal: ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి రూమర్స్.. సోషల్ మీడియాలో మీమ్స్ జాతర!
పూజా భవిష్యత్తు ఏంటి?
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే గుర్తింపు ఉంటుంది. ‘జన నాయగన్’ విడుదలై సంచలనం సృష్టిస్తే తప్ప.. పూజా హెగ్డేకు పూర్వ వైభవం కష్టమనేలా పరిస్థితి నెలకొంది. ఒకవైపు సినిమా కోర్టు చిక్కుల్లో ఉండటం, మరోవైపు చేతిలో కొత్త ప్రాజెక్టులు లేకపోవడంతో ఆమె అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ దుల్కర్ సరసన ఓ సినిమా చేస్తుందీ అమ్మడు. ఇక ఆ సినిమానే ఏమైనా నిలబెట్టాలి. ఈలోపు ‘జన నాయగన్’ అడ్డంకులన్నీ తొలగించుకుని ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో.. పూజా హెగ్డేను మళ్లీ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమాపై ఉన్న ఆసక్తి కూడా జనాల్లో తగ్గుతుంది. సంక్రాంతికి వచ్చి ఉంటే ఆ లెక్క వేరే ఉండేదనేలా ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

