Sankranthi Movies: సంక్రాంతి ఫిల్మ్స్.. మండే టెస్ట్‌లో నిలిచేదెవరు?
Actors from major Telugu films featured in a collage representing Sankranthi 2026 releases undergoing the crucial Monday box office test.
ఎంటర్‌టైన్‌మెంట్

Sankranthi Movies: సంక్రాంతి సినిమాలు.. మండే టెస్ట్‌లో నిలిచే సినిమా ఏది?

Sankranthi Movies: సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ అనేలా ఈ సంక్రాంతిని మార్చేశారు హీరోలు. ప్రతి సంక్రాంతికి భారీ స్థాయిలో సినిమాలు దిగుతుంటాయి. అందులో ఒకటి రెండు మినహా అన్ని పరాజయం చవిచూస్తుంటాయి. కానీ, ఈసారి సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ (Sankranthi 2026 Movies) కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నాయి. ముందుగా ఈ సంక్రాంతిని రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab)తో మొదలు పెట్టిన విషయం తెలిసిందే. తొలి రోజు నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ, కలెక్షన్ల పరంగా పండగ అడ్వాంటేజ్ ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. నార్మల్ టైమ్‌లో వచ్చి ఉంటే మాత్రం ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచేది. పండగ ఊపులో, అన్నిటికంటే ముందు ఈ సినిమా రావడం.. టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. ప్రస్తుతం బ్రేకీవెన్ దిశగా ఈ సినిమా వెళుతున్నట్లుగా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Also Read- Dhanush and Mrunal: ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి రూమర్స్.. సోషల్ మీడియాలో మీమ్స్ జాతర!

పండగను బాగానే వాడేశారు

ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీనే సృష్టిస్తోంది. సినిమా విడుదలై ఆరు రోజులు అవుతున్నా, కలెక్షన్ల విషయంలో మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే బ్రేకీవెన్ సాధించి, లాభాల బాటలో నడుస్తోంది. ఈ సినిమా తర్వాత వచ్చిన మాస్ మహారాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaki Wignyapthi) సినిమా కలెక్షన్ల పరంగా కాస్త డౌన్ నడుస్తున్నప్పటికీ, టాక్ పరంగా మాత్రం పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా కూడా బ్రేకీవెన్ దగ్గరలో ఉన్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. రవితేజ సినిమా తర్వాత ఒకే రోజు వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju), ‘నారీ నారీ నడుమ మురారీ’ (Nari Nari Naduma Murari) చిత్రాలు యూనానిమస్‌గా హిట్ టాక్‌ని సొంతం చేసుకున్నాయి. రెండు సినిమాలు 4 రోజులలోనే బ్రేకీవెన్ సాధించి లాభాల బాటలో నడుస్తున్నట్లుగా ట్రేడ్ రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి.

Also Read- AR Rahman: ఎవరినీ బాధపెట్టాలని కాదు.. వెనక్కి తగ్గిన రెహమాన్.. వీడియో వైరల్!

మండే టెస్ట్‌లో నిలిచేదెవరు?

అయితే, ఈ సినిమాలన్నీ పండగ అడ్వాంటేజ్‌ని బాగానే వాడుకున్నాయి. కలెక్షన్స్‌ని కూడా అదే రేంజ్‌లో రాబట్టాయి. ఇప్పుడు సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి అన్నీ మళ్లీ నార్మల్ కాబోతున్నాయి. అంతా పండగ మూడ్ నుంచి మళ్లీ నార్మల్ లైఫ్‌లో బిజీ బిజీ కాబోతున్నారు. కాబట్టి ఈ మండే ఈ సినిమాలన్నింటికీ అసలు సిసలు పరీక్ష (Monday Test) మొదలవుతుంది. మొత్తం ఐదు సినిమాలు విడుదలవడంతో.. థియేటర్లు అన్నింటికీ సరిపడా దొరకలేదు. చాలా దూరం ఉన్న థియేటర్లలో సినిమాలు ఆడుతుండటంతో చాలా మంది ఒకటి రెండు సినిమాలకే పరిమితమయ్యారు. ఇప్పుడు కాస్త థియేటర్ల విషయంలో కూడా ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలకు థియేటర్లు పెరుగుతాయి. ఈ క్రమంలో సోమవారం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో పాటు యునానిమస్ టాక్ తెచ్చుకున్న ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారీ’ చిత్రాలు కలెక్షన్స్ పరంగా కాస్త డౌన్ అయినప్పటికీ, స్టడీగా ఉంటే అవకాశం ఉంది. ‘ది రాజా సాబ్’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాలు మాత్రం.. ఈ సోమవారం అన్నిటిపరంగా డౌన్ అవ్వవచ్చు. ఈ క్రమంలో మేకర్స్ కొత్తగా ప్లాన్ చేసి, ప్రమోషన్స్‌లో జోరు పెంచాల్సిన అవసరముందని మాత్రం చెప్పుకోవాలి. చూద్దాం.. మండే టెస్ట్‌లో ఈ సినిమా ముందంజలో నిలుస్తుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Revanth Vs KTR: టీడీపీ పాట పాడడం వెనుక అసలు కుట్ర అర్థమైంది.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Jana Nayagan: ‘జన నాయగన్’ పరిస్థితేంటి? పాపం పూజా హెగ్డే?

RTC Officer Death: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ డిపో మేనేజర్ మృతి

Telangana Cabinet Meet: చారిత్రాత్మక రీతిలో హరిత హోటల్‌లో తెలంగాణ కేబినెట్ భేటీ

Sankranthi Movies: సంక్రాంతి సినిమాలు.. మండే టెస్ట్‌లో నిలిచే సినిమా ఏది?