Jagapathi Babu and Nagarjuna
ఎంటర్‌టైన్మెంట్

Jagapathi Babu: విలన్‌గా నాగార్జున.. జగపతిబాబు హర్ట్ అయ్యాడా?

Jagapathi Babu: కింగ్ నాగార్జున విలన్‌గా ఎంట్రీ ఇస్తుండటంతో.. విలక్షణ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) హర్ట్ అయ్యారా? ఈ ప్రశ్నకు సమాధానం ఈ నెల 15వ తేదీన తెలియబోతుంది. కింగ్ నాగార్జునను జగపతిబాబు సూటిగా ఓ ప్రశ్న అడిగారు. అదేంటంటే.. ‘నేనేదో చిన్న చిన్న విలన్ వేషాలు వేసుకుంటుంటే.. నువ్వు విలన్‌గా ఎంట్రీ ఇవ్వడమేంటి? నా పొట్ట కొట్టడమేంటి?’ అని అడిగారు. ఈ ప్రశ్నకు నాగార్జున ఇచ్చే సమాధానం తెలియాలంటే మాత్రం ఆగస్ట్ 15 వరకు వెయిట్ చేయక తప్పదు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘కూలీ’ (Coolie). ఈ సినిమా ఆగస్ట్ 14న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఫస్ట్ టైమ్ నెగిటివ్ రోల్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కింగ్ నాగార్జున జోరుగా పాల్గొంటున్నారు. అందులో భాగంగా జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ (Jayammu Nischayammu Raa) సెలబ్రిటీ టాక్ షో‌లో పాల్గొన్నారు. ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కాబోతోన్న ఈ షోకు మొట్టమొదటి గెస్ట్‌గా కింగ్ నాగార్జున హాజరయ్యారు.

Also Read- Spa Centers in Hyderabad: స్పా సెంటర్ల ముసుగులో మహానగరంలో గలీజ్ దందాలు..

కింగ్ నాగ్‌తో పాటు ఆయన సోదరి నాగ సుశీల, సోదరుడు వెంకట్ కూడా హాజరయ్యారు. ఈ షో‌కి సంబంధించిన ప్రోమోని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇందులో కింగ్ నాగార్జున (King Nagarjuna)ను బాగా ఇరికించే ప్రశ్నలను జగపతిబాబు సంధిస్తున్నారు. నాగార్జునను నా స్నేహితుడు అంటూ ఆహ్వానించిన జగపతిబాబు.. ‘సిగ్గు లేకుండా మాట్లాడుకునే షో ఇది’ అని క్లారిటీ ఇచ్చారు. అయితే నేను రెడీ అంటూ కింగ్ నాగ్ కూడా జగపతిబాబుకు సై చెప్పారు. రమ్యకృష్ణ లేదంటే టబు.. వీరిద్దరిలో బెస్ట్‌ కో యాక్ట్రెస్‌ ఎవరు..? అని నాగ్‌కు జగపతిబాబు ప్రశ్న సంధిస్తే.. ‘చెప్పకూడదు.. నేను చెప్పను’ అన్నారు. అంతేనా, వెంటనే జగపతిబాబుకు కూడా నాగ్ ప్రశ్న సంధించారు. ‘మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు.. రమ్యకృష్ణ లేదా సౌందర్య? అని అడిగారు. వెంటనే, జగపతిబాబు ఇది నా ఇంటర్వ్యూ కాదు.. దీనికి ఆన్సర్ నేను చెప్పను అని దాట వేశారు. ‘నేనేదో చిన్న చితకా క్యారెక్టర్స్ చేసుకుంటా బతికేస్తుంటే.. నువ్వు మధ్యలో విలన్ చేయడం ఏంటి? చెప్పు నాకు మ్యాటర్? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జవాబుని ఈ ప్రోమోలో చూపించలేదు.

Also Read- Vijay Devarakonda: బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌తో విజయ్ సినిమా.. కాంబో అదిరింది!

‘ఒకడు పుట్టగానే ఎవడి చేతిలో పోతాడన్నది వాడి తలమీద రాసి పెట్టి ఉంటుంది’.. అని నాగ్ చెప్పే ‘కూలీ’ సినిమా డైలాగ్‌తో ఈ ప్రోమోని ముగించారు. ఈ షో జీ తెలుగులో ఆగస్ట్ 17న 9 గంటలకు ప్రసారమవుతుందని, అలాగే ఆగస్ట్ 15 నుంచి జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంటుందని ఈ ప్రోమోలో మేకర్స్ తెలియజేశారు. ఈ ప్రోమో చూస్తుంటే.. సెలబ్రిటీల కొంపలు ముంచే షోలాగానే కనిపిస్తుంది. అందులోనూ జగపతిబాబు.. చాలా ముక్కుసూటి మనిషి. అస్సలు భయపడడు. తనకి దోచింది అడిగేసే రకం. కాబట్టి.. ఈ షోకి వచ్చే సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి.. అనేది ఈ ప్రోమోతోనే క్లారిటీ ఇచ్చేశారు. చూద్దాం.. ఈ షో ఎంతగా సక్సెస్ అవుతుందో..?

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు