Rukshar Dhillon: రుక్సార్ ధిల్లాన్.. ‘ఆకతాయి’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత కృష్ణార్జున యుద్ధం, ABCD వంటి చిత్రాల్లో నటించింది. ఈమె అందానికి కుర్రకారులు ఫిదా అయిపోయారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘దిల్ రూబా’ చిత్రంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనెల 14న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ రుక్సార్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
ఈ సందర్బంగా రుక్సర్ మాట్లాడుతూ.. తాను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నానని చెప్పింది. అయితే ఇప్పుడు మాట్లాడాలంటే కాస్త భయంగానే ఉందని పేర్కొంది. ఇక్కడ ఉన్న ఆడియన్స్‌లో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారని తెలిపింది. మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతానని, మనం సాధారణంగా ఫోటోస్ తీసుకుంటాం కదా.. మీరు కూడా ఎవరివైనా ఫోటోస్ తీస్తారు కదా అని పేర్కొంది. కానీ కాస్త ఇబ్బందిగా ఉందని చెబితే వేరే వాళ్ళ ఫోటో తీయరు కదా. అలాగే మీరు కంఫొర్టుగా లేనప్పుడు ఫోటోలు దిగేందుకు ఇంట్రెస్ట్ చూపించరు కదా అని వెల్లడించింది. అయినా తాను కూడా చాలా ప్రేమగా, గౌరవంగా చెప్పానని, ఇది కొంచం ఇబ్బందిగా ఉందని.. ఫోటోస్ తీయొద్దని అని తెలిపింది. స్టేజ్ పై ఇప్పటి వరకు ఏం జరిగిందో అందరూ చూశారు కదా.. మొదటి నుంచి ఫొటోస్ తీస్తున్నప్పుడు ఏం చోటుచేసుకుందో చూశారు కదా. ఎవరి పేర్లు చెప్పను కానీ ఎవరికి అర్థమవ్వాలో వాళ్లకు ఈ విషయం అర్థమవుతుందని చెప్పింది. గౌరవంగా చెప్పినా ఇప్పటికీ ఏం జరుగుతుందో మీరు చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
Also Read: భర్తతో విడిపోవడంపై నిహారిక కామెంట్స్ వైరల్
ఇక దిల్‌రూబా చిత్రానికి విశ్వ కరుణ్ డైరెక్షన్ వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే ముందుగా ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్‌ఫోన్ చేశారు. ఇప్పుడు మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ అండ్ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి
రుక్సార్ ధిల్లాన్ లండన్‌లో జన్మించింది. అయితే ఆమె గోవాలో పెరిగి పెద్దది అయ్యింది. ఈమె ఫ్యామిలీ ప్రస్తుతం బెంగళూరులో సెటిల్ అయ్యింది. ఈ బ్యూటీ ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ పట్టా కూడా పొందింది. ధిల్లాన్ తన సినీ కెరీర్ కన్నడ ఫిల్మ్ ‘రన్ ఆంటోనీ’తో స్టార్ట్ చేసింది. హీరో వినయ్ రాజ్‌కుమార్‌కు జంటగా ఈ చిత్రంలో నటించింది. 2018లో నాని సరసన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో నటించింది. ఇక 2020లో భాంగ్రా పా లే మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక వరుసగా ఛాన్స్‌లు దక్కించుకుంటూ ముందుకు వెళ్తోంది.