Anjali
ఎంటర్‌టైన్మెంట్

Star Heroine: ప్రేమలో పడ్డ స్టార్ హీరోయిన్? ప్రేమ పాఠాలు అతనితోనే?

Star Heroine: సినీ నటుల పర్సనల్ లైఫ్ ఎప్పుడు తెరిచిన పుస్తకం లాంటిది. ఏ విషయమైనా దాచిపెట్టాలని ప్రయత్నం చేసిన ఫలితం ఉండదు. ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంటుంది. ఇక సినీ ప్రముఖులు మరొకరితో కాస్త వేరే వారితో సన్నహితంగా ఉంటే.. మరుక్షణమే వారితో బంధం అంటగడుతారు. ఇక హీరోయిన్స్ విషయంలో మాత్రం ఇలాంటివి ఎక్కువగానే కనిపిస్తాయి. హీరోయిన్స్ మరో వ్యక్తితో కనిపిస్తే చాలు.. రిలేషన్ కలుపుతారు. ఇలా రూమర్స్ రావడం కామన్ అయిపోయింది. 

ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ప్రేమలో పడిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఒకరితో బ్రేకప్ చెప్పిన ఆ భామ మరొకరితో లవ్ ట్రాక్ నడిపిస్తుందని తెలుస్తుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు.. హీరోయిన్ అంజలి(Anjali). 2006లో ‘ఫోటో’ అనే చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత ‘ప్రేమలేఖ రస’ అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత తమిళంకు మకాం మార్చింది. ‘కత్తరదు’ అనే చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన అందం, అభినయంతో ఎంతో మంచి అభిమానులను సొంతం చేసుకుంది. ఆయుధం, అంగడి తేరు, తూంగా నగరం, మంకథ, మహారాజా, వాటికూచి, తారామణి, నిశ్శబ్దం, యేజు కడల్ యేజు మలై వంటిని సూపర్ హిట్ మూవీస్‌లో నటించి తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అప్పుడప్పుడు తెలుగులో కూడా నటిస్తూ ఇక్కడి ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, సరైనోడు, వకీల్ సాబ్ వంటి తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ కూడా ఓ కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది.

ఇదిలాఉండగా.. ఈ బ్యూటీకి సంబంధించిన వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఓ హీరోతో ప్రేమలో పడిందని వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో తమిళ్ హీరో జై తో అంజలి ప్రేమలో పడిందని, ఇద్దరు కొంతకాలం ప్రేమించుకుని విడిపోయారని వార్తలు కూడా వచ్చాయి. జర్నీ మూవీలో అంజలి-జై కలిసి నటించారు. ఈ క్రమంలోనే సాన్నిహిత్యం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారిందట. బహిరంగంగానే ఇద్దరు చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. ఇద్దరు ప్రేమలో పీకల్లోకి వెళ్లారట. అంజలి చేసే సినిమాల షూటింగ్‌లకు సైతం జై వచ్చేవాడట.

Also Read: స్టార్ హీరోయిన్‌కి అభిమాని పెళ్లి ప్రపోజల్.. రియాక్షన్ ఏంటంటే?

anjali

అయితే అంజలికి కొన్ని కండిషన్స్ జై పెట్టేవాడట. ఆ మూవీలో నటించవద్దు అంటూ మంచి మంచి హిట్ సినిమాలు మిస్ చేశాడట. డైరెక్టర్లు ముందుగా అంజలీ చేసే చిత్రాల స్టోరీలు జైకి చెప్పిన తరువాత ఓకే చెబితేనె ఆమెకు చెప్పేవారట. అంతేగాక ఎప్పుడు అంటే అప్పుడు డబ్బులు కూడా ఇచ్చేదట. ఇక మొత్తానికి అన్ని విధాలుగా విసుగు చెంది చివరకు జై కి అంజలి లవ్ బ్రేకప్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. మొత్తానికి అలా జైకి బ్రేకప్ చెప్పి సింగిల్ లైఫ్ లీడ్ చేస్తోంది. ఈ క్రమంలోనే మరో హీరోతో ప్రేమలో పడినట్టు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ కి చెందిన ఓ హీరోతో మళ్ళీ ప్రేమ పాఠాలు మొదలు పెట్టిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అయితే ఆ హీరో ఎవరూ అనేది ఇంకా తెలియరాలేదు.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?