Samantha
ఎంటర్‌టైన్మెంట్

Samantha: సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమైందా?

Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. వ్యక్తి విషయాలు పంచుకుంటూ ఉంటుంది. అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటిస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో సమంతకు సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందట. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం సమంత సింగిల్ గానే ఉంటుంది. అయితే బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడిందని, ఇద్దరు గత కొంత కాలం నుంచి డేటింగ్‌లో ఉన్నారనేలా ఇటీవల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వార్తలకు బలం చేకూర్చేలా.. ఈనెల 14న వాలంటైన్స్ డే సందర్బంగా సమంత సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ ఉండటంతో, సమంత ప్రేమ వ్యవహారంపై మరింతగా మీడియా మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఇచ్చినట్లయింది. ‘నిన్ను లవ్ చేయాలంటే భయమేస్తోంది.. లైఫ్ లాంగ్ నా చేయి పట్టుకొనే ఉంటావా..?’ అనే మీనింగ్ వచ్చేలా సమంత ఆ పోస్ట్‌లో పేర్కొంది. ఈ పోస్ట్‌తో సమంత సెకండ్ మ్యారేజ్ చేసుకునే ఆలోచనలో ఉందనేలా సోషల్ మీడియా ప్రపంచం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసింది. ఇప్పటికే నాగ చైతన్యను పెళ్లి చేసుకుని డైవర్స్ తీసుకుని బాధపడుతూ ఉంది సమంత. మరోసారి అలా రిపీట్ కాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని సమంత భావిస్తుందేమో అని అభిమానులు అనుకుంటున్నారు.

Also Read- Tallest Heroine: సినీ ఇండస్ట్రీలో హైట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

ఈ క్రమంలోనే సమంత రెండో పెళ్లిపై ఓ ప్రముఖ యూట్యూబర్ సంచలనం వ్యాఖ్యలు చేశాడు. యూట్యూబర్ దాసరి విజ్ఞాన్ మాట్లాడుతూ.. సమంత రెండో వివాహం చేసుకుంటే తప్పేంటి అని ప్రశ్నించాడు. అందరూ ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు. నాగ చైతన్య (Naga Chaitanya) అయితే రెండో మ్యారేజ్ చేసుకోవచ్చు కానీ, సమంత చేసుకుంటే ఏమవుతుందని సదరు యూట్యూబర్ క్లాస్ ఇస్తున్నాడు. సమంత సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది అంటే ఎందుకు తప్పుగా భావిస్తున్నారు. నేటి కాలంలో కొందరు అయితే రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పెళ్లి అనేది కామన్ అయిపోయింది. త్వరలోనే సమంత నుంచి గుడ్‌ న్యూస్ వింటాం.. ఆమె కూడా పెళ్లి చేసుకునే ఛాన్స్‌లు ఉన్నాయని వెల్లడించాడు.

Samantha and Raj
Samantha and Raj

ఇక సమంత నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘సిటాడెల్’ వంటి వెబ్‌ సిరీస్‌లకు రాజ్ నిడిమోరు (Raj Nidimoru), డీకే డైరెక్షన్ వహించారు. ఈ వెబ్‌ సిరీస్‌ల సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, ప్రేమ మొదలైందని ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ పలు ఈవెంట్స్‌కు వెళ్లడం కూడా అందరి కంట పడింది. అయితే రాజ్ నిడిమోరుకు గతంలో పెళ్లి కాగా.. భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడాయన సింగిల్ గానే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే సమంతతో డేటింగ్‌లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇటు సమంత కానీ, అటు రాజ్ కానీ ఇప్పటి వరకు స్పదించలేదు. వీరిద్దరిలో ఎవరూ ఒకరు క్లారిటీ ఇస్తే తప్ప ఈ వార్తలకు చెక్ పడదు.

ఇవి కూడా చదవండి:
People Media Factory: చిక్కుల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. గట్టెక్కేనా?

Trivikram Srinivas: సినిమాలకు దూరం.. పవన్‌తోనే పయనం

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు