Allu Arjun: పేరు మార్చుకోనున్న అల్లు అర్జున్ .. కొత్త పేరు ఏంటంటే?
Allu Arjun Image Source Twitter
ఎంటర్‌టైన్‌మెంట్

Allu Arjun: పేరు మార్చుకోనున్న అల్లు అర్జున్ .. కొత్త పేరు ఏంటంటే?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjunగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా బన్నీ హీరోగా నటించిన ” పుష్ప2 ” మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే. గతేడాది 2025 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను బ్రేక్ చేసి, కొత్త రికార్డులను క్రియోట్ చేసింది. వరల్డ్ వైడ్ గా అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 లాంగ్ రన్ లో మొత్తం రూ. 1870 కోట్లకు పైగా కలెక్ట్ చేసి .. ఇండియన్ సినిమాలో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన రెండవ మూవీగా చోటు సంపాదించుకుంది. దీంతో, దేశమంతా ఐకాన్ స్టార్ ఇక్కడ తగ్గేదే లే అంటూ పేరు మారుమోగింది. అల్లు అర్జున్ అంటే పేరు ఒక్కటే కాదు పాన్ ఇండియా బ్రాండ్ అనే రేంజ్ కి ఎదిగాడు.

Also Read : Sudharshan on Adulterated Goods: బిగ్ అలెర్ట్.. ఆ ఆహార పదార్థాలతో జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి!

ఇదిలా ఉండగా నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. తెలిసిన సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తన పేరును త్వరలో మార్చుకోనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. న్యూమరాలజీ ప్రకారం బన్నీ తన పేరులోని లెటర్స్ ను మార్చే ఆలోచనలో ఉన్నార. ఇప్పుడున్న లెటర్స్ తో పాటు U’లు, N’ లు కొత్తగా యాడ్ అవుతాయని సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే, వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Also Read: Inspector Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే!

దీని గురించి అతని టీమ్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఇదిలా ఉండగా.. బన్నీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై రోజురోజుకూ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి #AA22 అనే పాన్ ఇండియా చిత్రానికి రెడీ అవుతున్నారు. నెల 8 అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ నుమూవీ టీం  అధికారికంగా ప్రకటించింది. వీటితో పాటు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో పౌరాణిక మూవీని లైన్లో పెట్టారు. దీనిలో ఐకాన్ స్టార్ లార్డ్ కార్తికేయ పాత్రలో కనిపించనున్నారని టాక్ వినబడుతోంది.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?