Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ మూవీతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. ఈ చిత్రంతో సందీప్ రెడ్డి వంగా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. తన కెరీర్‌లో డైరెక్షన్ వహించిన చిత్రాలన్నీ మంచి విజయాలు అందుకున్నాయి. ‘అర్జున్ రెడ్డి’ని బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ అనే పేరుతో రీమేక్ చేశాడు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. దీంతో హిందీలో సందీప్ రెడ్డి వంగా క్రేజ్ అమాంతం పెరిగింది. గతేడాది ఆయన డైరెక్షన్‌లో యానిమల్ అనే మరో చిత్రం బాలీవుడ్‌లో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి కూడా కీలక రోల్స్ పోషించారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.900 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసింది. అయితే ఈ మూవీపై పలువురు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘యానిమల్’లో స్త్రీని తక్కువ చేసి చూపించాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఒక ఐఏఎస్ సైతం ఈ మూవీపై విమర్శించడం అప్పట్లో హాట్‌టాపిక్ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హీరో లేకుండానే మూవీ తీస్తా అని సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
అయితే ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగాకి ఓ ప్రశ్న ఎదురైంది. ‘మీరు సాంగ్స్ లేదా హీరో లేకుండా మూవీ తీస్తారా?. ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోండి’ అని యాంకర్ అడిగారు. వెంటనే సందీప్ రెడ్డి వంగా సమాధానమిస్తూ.. ఫ్యూచర్‌లో హీరో లేకుండా సినిమా తీయాల్లన్నదే తన ఆలోచన అని పేర్కొన్నాడు. ఒకవేళ అలా మూవీ తీస్తే.. ఇప్పటివరకు తనపై విమర్శలు చేసిన మహిళలు సైతం ఇష్టపడరని తెలిపాడు. కావాలంటే పేపర్‌పై రాసి ఇస్తా అని సవాల్ విసిరారు. రాబోయే 4,5 ఏళ్లలో హీరో లేకుండా మూవీ తీసి తీరుతానని, అప్పుడు సందీప్ రెడ్డి చెప్పింది చేశాడని అనుకుంటారని తెలిపాడు.
Also Read : సినిమాలకు గుడ్‌బై చెప్పి.. గూగుల్‌లో మహేష్ బాబు హీరోయిన్ ఉద్యోగం!
మరోవైపు ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తి అనే వ్యక్తి ‘కబీర్ సింగ్’ చిత్రంపై చేసిన కామెంట్స్‌పై సందీప్ రెడ్డి వంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమాజాన్ని 10 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్తున్నాయని, ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారో అర్థం కావడం లేదని వికాస్ దివ్యకీర్తి వ్యాఖ్యలు చేసాడు. ఆయన వ్యాఖ్యలపై సందీప్ రెడ్డి వంగా స్పందిస్తూ.. ఓ ఐఏఎస్ అధికారి యానిమల్ లాంటి చిత్రాలు తీయొద్దని చెప్పడం.. తనకు ఏదో పెద్ద నేరం చేసినట్టు అనిపించిందని సందీప్ రెడ్డి అన్నారు. ఆ టైంలో కోపం వచ్చిందని, ఒక్కటే అర్థం చేసుకున్నానని తెలిపాడు. వికాస్ దివ్యకీర్తి బాగా కష్టపడి చదువుకుని ఐఏఎస్ అయ్యాడని, ఎవరైనా 2,3 ఏళ్లు కష్టపడి 1500 పుస్తకాలు చదివితే ఈజీగా ఐఏఎస్ అవుతారని అన్నారు. అదే డైరెక్టర్ కావాలంటే అంతా ఈజీ కాదని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.