Mayuri Kango
ఎంటర్‌టైన్మెంట్

Actor: సినిమాలకు గుడ్‌బై చెప్పి.. గూగుల్‏లో మహేష్ బాబు హీరోయిన్ ఉద్యోగం!

Actor: సినీ పరిశ్రమ అనగానే అందరూ గ్లామరస్‌గా ఉంటుందని అనుకుంటారు. కానీ, ఎంతో మంది స్ట్రగుల్స్‌ పడుతూ ఉంటారు. కెరీర్ ప్రారంభం నుంచి ఫేమ్‌ వచ్చిన తర్వాత కూడా అనేక ఇబ్బందులు వారికి ఎదురవుతుంటాయి. వీటన్నింటిని తట్టుకోగల వారే రాణిస్తారు.. తట్టుకోలేని వారు వెనకడుగు వేస్తూ ఉంటారు. ఈ జాబితాలో హీరోయిన్ మయూరి కాంగో కూడా ఒకరు. బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పింది.

1995లో ‘నసీమ్’ అనే చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత పాపా కెహ్తే హై, బేతాబీ, హోగీ ప్యార్ కీ జీత్ వంటి బ్యాక్ టు బ్యాక్ విజయవంతమైన మూవీస్ చేస్తూ అలరించింది. ఆమెకి ‘పాపా కెహతే హై’ అనే మూవీ మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత మెరే అప్నీ, బాదల్, పాపా ది గ్రేట్, జంగ్, షికారి వంటి చిత్రాల్లో నటించింది. ఇవి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయాయి. దీంతో వరుసగా ప్లాఫ్ మూటకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత హిందీలో ఛాన్సెస్ రాలేదు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘వంశీ’ మూవీలో నటించింది. మళ్ళీ తెలుగులో అవకాశాలు ఏమి రాలేదు. మయూరి కాంగోకి ఇదే చివరి చిత్రం కావడం విశేషం.

ఇక మూవీస్‌లో ఛాన్సెస్ రాకపోవడంతో నర్గీస్‌, థోమా గమ్‌ థోడీ ఖుషీ, డాలర్‌ బాబు, కిట్టీ పార్టీ వంటి సీరియల్స్‌లో యాక్ట్ చేసింది. అవి కూడా తగిన గుర్తింపు తీసుకురాలేదు. తన కెరీర్‌లో మొత్తం 12 సినిమాల్లో నటించింది. అయితే అందులో ఒకటి రిలీజ్‌కు నోచుకోలేదు. అటు 10 సీరియల్స్‌లో నటించింది. అటు సినిమాల్లో.. ఇటు సీరియల్స్‌లో నటించినప్పటికీ సరైన గుర్తింపు మాత్రం రాలేదు. ఆ తర్వాత మొత్తానికే మయూరి కాంగోకి అవకాశాలు రాలేదు. దీంతో సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. 2003లో ఎన్‌ఆర్‌ఐ ఆదిత్య థిల్లాన్‌ను పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత న్యూయార్క్‌‌లో ప్రముఖ కాలేజ్‌ బరూచ్‌ కాలేజ్‌ జిక్లిన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ కంప్లీట్ చేసింది. డిజిటల్‌ మీడియాలో మయూరి న్యూ కెరీర్ స్టార్ట్ చేసింది. ప్రముఖ గ్లోబల్‌ మీడియా ఏజెన్సీ పెర్ఫామిక్స్‌ అనే సంస్థలో ఎండీ స్టేజ్‌కి ఎదిగింది. ప్రస్తుతం గూగుల్‌ ఇండియాలో పనిచేస్తోన్నమయూరి కాంగో.. ఓ పెద్ద పొజిషన్‌లో ఉంది. కార్పొరేట్‌ రంగంలో దూసుకెళ్తూ మయూరి తనదైన ముద్ర వేసుకుంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!