ibomma ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

iBOMMA: ఐబొమ్మకు బిగ్ షాక్.. నిర్వహకుడు ఇమ్మడి రవి అరెస్ట్?

iBOMMA: ఐబొమ్మ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసులకే సవాల్ విసిరిన ఈ ఆన్లైన్ బొమ్మకు బిగ్ షాక్ తగిలింది. ఐబొమ్మ(iBOMMA) వెబ్ సైట్ ఓనర్ ఇమ్మడి రవిని తెలంగాణ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ (arrest) చేశారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఇమ్మడి రవిని కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరేబియన్ దీవుల్లో నివసిస్తూ ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్‌ను నడిపిస్తున్న రవి. తెలుగు సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేసి తన సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నాడు. చిత్రం రిలీజ్ అయిన కొన్ని నిముషాల్లోనే HD ప్రింట్‌ను ఐబొమ్మలో అప్‌లోడ్ చేయడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామంటూ తెలుగు నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా గతంలోనే కేసు నమోదైంది. ” దమ్ముంటే పట్టుకోండి ” అంటూ రవి పోలీసులకు సవాలు విసిరిన విషయం తెలిసిందే. ఆ సవాలుకు ఇప్పుడు పోలీసులు సమాధానమిచ్చారు రవిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.

Also Read: KTR Warns Congress: బీఆర్ఎస్ కార్యకర్త ఇంటిముందు కేటీఆర్ ప్రెస్‌మీట్.. జూబ్లీహిల్స్ ఓటమిపై సంచలన వ్యాఖ్యలు

నన్ను అరెస్టు చేస్తే సినీ ఇండస్ట్రీతోపాటు పోలీసుల జీవితాలను కూడా బయటపెడతానంటూ రవి బెదిరింపులకు పాల్పడ్డాడు. తన వెబ్‌సైట్‌పై కన్నేస్తే అందరి గురించి చెప్పేస్తా అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. ఈ బెదిరింపుల నేపథ్యంలో గత ఆరు నెలలుగా పోలీసులు రవి వేటలో ఉన్నారు. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నట్టు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అనంతరం రవి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు. సర్వర్లు ఓపెన్ చేసి వెబ్‌సైట్ కంటెంట్‌ను పరిశీలిస్తున్నారు. ఐబొమ్మ పైరసీ కారణంగా సినీ పరిశ్రమకు సుమారు రూ.3,000 కోట్ల నష్టం వాటిల్లినట్టు పోలీసులు గతంలో వెల్లడించారు.

Also Read: Kunamneni Sambasiva Rao: జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్ విజయంపై.. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు

Just In

01

Varanasi Glimpse: ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే.. మహేష్ బాబు ఇరగదీశాడుగా

New Bus Stations: ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్.. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 3 బస్‌స్టాండ్లు.. ఎక్కడెక్కడో తెలుసా?

Farooq Abdullah: ఉగ్రదాడిలో వైద్యుల ప్రమేయంపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు… తీవ్ర వివాదాస్పదం

AV Ranganath: బతుకమ్మకుంట బాగుందా? వాకర్లతో ముచ్చటించిన హైడ్రా కమిషనర్!

Rahul Gandhi: వెరీ గుడ్ రేవంత్ టీమ్ వర్క్ సూపర్ గో హెడ్.. రాహుల్ గాంధీ కాంప్లిమెంట్!