Actress: ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఊపు ఊపేసిన హీరోయిన్స్ చాలా మంది రీ ఎంట్రీ ఇస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుసగా సినిమా ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు. స్టార్ హీరోయిన్‌గా రాణించిన వారు సైతం అక్క, వదిన, అత్త పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల సీనియర్ నటి రంభ సెకండ్స్ ఇన్నింగ్స్‌కి రెడీ అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ కూడా రీ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ సినిమాకు ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ వహిస్తున్నాడు. ‘బింబిసార’ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ‘విశ్వంభర’లో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. అధిక రంగనాథ్ కూడా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. సోషియో ఫాంటసీ స్టోరీతో చిరంజీవి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే చాలా మంది హీరోయిన్‌లు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకప్పుడు తన అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్.. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు..ఇషా చావ్లా.
‘ప్రేమ కావాలి’ అనే చిత్రంతో ఇషా చావ్లా టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ మువు మంచి హిట్ ని సొంతం చేసుకుంది. డైలాగ్ కింగ్ సాయి కుమారుడు ఆది ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన సంగతి తెలిసందే. ఇక చిత్రంలో సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ‘పూల రంగడు’ అనే సూపర్ హిట్ అందుకుంది ఈ హాట్ బ్యూటీ. శ్రీమన్నారాయణ, మిస్టర్ పెళ్ళికొడుకు, జంప్ జిలాని, విరాట్ వంటి చిత్రాల్లో నటించింది.
ఈ భామ చివరిసారిగా 2016 ‘రంభా ఊర్వసి మేనక’ అనే చిత్రంలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ. మళ్ళీ రీ ఎంట్రీకి సిద్దమవుతుందే వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది అని తెలుస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం వచ్చిందని సమాచారం. చిత్రయూనిట్ సంప్రదించగా.. ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది.

Also Read: ఆసక్తికర విషయం చెప్పిన నాని.. ఎంతైనా మెగాస్టార్ కదా!
ఇక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’ అనే చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకున్నారు. ఇందులో రవితేజ ప్రధాన పాత్రలో నటించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం విశ్వంభర అనే చిత్రంలో చిరు నటిస్తున్నారు. అంజి తరువాత మెగాస్టార్ చేస్తున్న గ్రాఫిక్స్ మూవీ ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.