Hollywood Star: ప్రముఖ హాలీవుడ్ నటుడు యాక్టర్ జో డాన్ బేకర్ కన్నుమూశారు. జేమ్స్ బాండ్ సినిమాలలో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. అంతే కాదు, ఎన్నో అవార్డులు గెల్చుకున్నాడు. ఆయన వయస్సు 89 ఏళ్లు. గత కొన్ని రోజుల నుంచి ఆయన ఊపిరి తిత్తుల క్యాన్సర్ తో బాధ పడుతున్నాడు. దీనికి సంబందించిన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా మే 7న ఆయన మరణించారని జో డాన్ కుటుంబం వెల్లడించింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: Star choreographer: నా భర్త ” గే ” అంటూ.. నమ్మలేని నిజాలు బయట పెట్టిన ఆ స్టార్ నటి!
ఫిబ్రవరి 12, 1936న టెక్సాస్‌లోని గ్రోస్‌బెక్‌లో జన్మించిన బేకర్, US ఆర్మీలో రెండేళ్ళు పనిచేసిన తర్వాత నార్త్ టెక్సాస్ స్టేట్ కాలేజీలో డిగ్రీ పొందారు. తర్వాత ఆయన సినిమాల్లోకి వెళ్ళారు. టెలివిజన్ కెరీర్‌ను ప్రారంభించడానికి ముందు నటుడిగా ట్రైనింగ్ తీసుకోవడానికి న్యూయార్క్ నగరానికి వెళ్లారు. బేకర్ మిచెల్, చార్లీ వారిక్, ది నేచురల్, కేప్ ఫియర్ (1991), ఫ్లెచ్, మార్స్ అటాక్స్ ఎన్నో సినిమాలలో నటించాడు.
Also Read: Heroine Divorce: సినీ ఇండస్ట్రీలో మరో విడాకులు.. ఆమె సడెన్ గా ఇండియాకు ఎందుకొచ్చింది?