Dilruba Movie Still
ఎంటర్‌టైన్మెంట్

Dilruba: జంట బాగుంది.. ‘హే జింగిలి’ వచ్చేసింది

Dilruba Song Released: ఇటీవల వచ్చిన ‘క’ సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు యంగ్ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). అంతకు ముందు చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అవడంతో తీవ్ర నిరాశలో ఉన్న కిరణ్‌ అబ్బవరంను, ‘క’ సినిమా (KA Movie) కొన్నాళ్ల పాటు నిలబడేలా చేసి, తనివి తీరిపోయే హిట్ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం చేస్తున్న చిత్రం ‘దిల్ రూబా’. ఈ సినిమా ‘క’ కంటే ముందే పిక్చరైజ్ జరిగిందనే విషయం చాలా మందికి తెలియదు. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్‌కు నోచుకోలేదు. ఇప్పుడు కూడా ఈ సినిమా రిలీజ్ విషయంలో కష్టాలు పడుతూనే ఉంది. రెండు మూడు సార్లు వాయిదా పడిన ఈ సినిమాను, మార్చి 14న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ రీసెంట్‌గానే అధికారికంగా ప్రకటించారు. మరి ఆ తేదీకైనా ఈ సినిమా వస్తుందో.. మరోసారి వాయిదా పడుతుందో చూడాల్సి ఉంది. ఈ లోపు ప్రమోషన్స్‌పై టీమ్ దృష్టి పెట్టింది. మంగళవారం ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Also Read-  Allu Arjun: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!

‘దిల్ రూబా’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘అగ్గిపుల్లె..’ మంచి స్పందనను రాబట్టుకోగా.. ఇప్పుడొచ్చిన ‘హే జింగిలి’ అంటూ సాగే సెకండ్ సింగిల్‌ కూడా వినసొంపుగానే ఉంది. మరీ ముఖ్యంగా ఈ పాటలో కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంట చూడముచ్చటగా ఉంది. సామ్ సిఎస్ కంపోజ్ చేసిన ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించారు. ఈ పాటను సంగీత దర్శకుడు సామ్ సిఎస్ ఆలపించడం విశేషం. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే, ‘క’ సినిమా విజయాన్ని దృష్టిలో పెట్టుకుని.. ‘దిల్ రూబా’కు సంబంధించిన కొన్ని సీన్లు రీ షూట్ చేసినట్లుగా సమాచారం. హీరో కిరణ్ అబ్బవరం ఈ సినిమా ప్రమోషన్స్‌లో యమా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా కూడా ‘క’ తరహాలోనే బ్లాక్‌బస్టర్ అవుతుందని ఆయన నమ్మకంగా చెబుతున్నారు.

హీరో అంత నమ్మకంగా చెబుతున్నా, పాటలు, టీజర్స్ విడుదలవుతున్నా.. సినిమాపై మాత్రం అనుకున్నంతగా అయితే బజ్ రావడం లేదు. అందుకు టీమ్ బీభత్సంగా ఏదైనా ప్లాన్ చేయాలి. విడుదలకు ఇంకా టైమ్ ఉంది కాబట్టి.. ఈ లోపు ఏదైనా వెరైటీగా ప్లాన్ చేసి, అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడంలో మేకర్స్ ఎంత మేరకు సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది. శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా విశ్వ కరుణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: 

Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?

Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’లో ఆ సీన్ వాడేశా!

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు