Hey Bhagavan: ‘లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన బన్నీవాస్ (Bunny Vas), వంశీ నందిపాటి (Vamsi Nandipati) సక్సెస్‌ఫుల్ ద్వయం చేతిలోకి ఇప్పుడు మరో మూవీ చేరింది. నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై వారు సుహాస్ (Suhas) హీరోగా నటించిన ‘హే భగవాన్’ (Hey Bhagavan) అనే ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఫిబ్రవరి 20న ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. వైవిధ్యమైన చిత్రాల కథానాయకుడుగా అతి తక్కువ చిత్రాలతోనే పేరొందిన సుహాస్ హీరోగా, ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ శివానీ నాగరం హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో యాంకర్ స్రవంతి చొక్కారపు ఓ ప్రముఖ పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. అలాగే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 20న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
Also Read- Jr NTR: ఎన్టీఆర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
ఎక్కడా రాజీపడకుండా
ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో హీరో సుహాస్ మాట్లాడుతూ.. టీజర్ లాంచ్ అనగానే నాకు మేసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో నా పాత్ర ఇంతకు ముందు చేసిన సినిమాలతో పోలీస్తే చాలా డిఫరెంట్‌గా, చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పాత్రను చేశాను. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ విత్ కంటెంట్ అనమాట. ఇక నుంచి నా సినిమాలు అందర్ని అలరిస్తాయి. ఈ సినిమాకు వంశీ నందిపాటి, బన్నీవాస్ యాడ్ అయిన తర్వాత మా టీమ్‌కు మంచి బూస్ట్ వచ్చింది. నిర్మాత నరేంద్ర రెడ్డి ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఈ సినిమా నా కెరీర్‌లో బెస్ట్ ఫిలింగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాను. నాకు ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నారు. శివానీ నగరం మాట్లాడుతూ.. వంశీ, బన్నీవాస్‌లు ఈ సినిమాను మరో బ్లాక్ బస్టర్‌గా నిలుపబోతున్నారు. వాళ్లు చేస్తున్న ప్రతి సినిమా బ్లాక్ బస్టరేనని, ఫిబ్రవరి 20న ఈ సినిమా థియేటర్లలో బ్లాస్ట్ కాబోతుందని తెలిపారు.
Also Read- Anil Ravipudi: ఎన్టీఆర్, కేటీఆర్.. విజ్ఞాన్ కాలేజ్ అనుభవాలను గుర్తు చేస్తుకున్న అనిల్ రావిపూడి!
గెస్ చేసి బహుమతి పొందండి
వంశీ నందిపాటి మాట్లాడుతూ.. నేను ఆరు నెలల ముందు ఈ కథ విన్నాను. సినిమా పూర్తవ్వడానికి మినిమమ్ సంవత్సరం పడుతుందని అనుకున్నాను. కానీ అతి తక్కువ టైమ్‌లోనే చిత్రీకరణ పూర్తి చేసి బెటర్ అవుట్‌పుట్‌తో వచ్చారు. ఈ సినిమా టీజర్‌లో ఉన్నట్లుగా ఆడియన్స్ ఎవరైనా సరే ఈ సినిమాకు ఎంత బిజినెస్ అయిందో గెస్ చేసి బహుమతి అందుకోవచ్చు. ఈ సినిమా నరేంద్ర కోసం టేకప్ చేసినా.. సినిమాలో ఎంతో పొటెన్షియల్ ఉంది. ఈ సినిమాతో నిర్మాత నరేంద్ర రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తుంది. సుహాస్ నుంచి ఆడియన్స్ ఎటువంటి కంటెంట్ కావాలని అనుకుంటున్నారో.. ఇందులో అలాంటి కంటెంట్‌ను సుహాస్ డెలివరీ చేశాడు. అంతా ఈ సినిమాలో కొత్త సుహాస్‌ను చూడబోతున్నారు. శివానీకి ఈ సినిమా మూడో బ్లాక్‌బస్టర్. ఆమె పాత్ర కూడా సినిమాలో ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా డిజైన్ చేశారు. ఎడిటర్ విప్లవ్ కంటెంట్ ప్రొటెక్షన్ కోసం ఓ మంచి యాప్‌ను క్రియేట్ చేశాడు. అది మాకే కాదు, అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎప్పటిలానే, ఓ మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. గ్యారంటీగా మంచి హిట్ కొట్టబోతున్నామనే నమ్మకముందని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

