Chiranjeevi: ఆ కుర్ర బ్యూటీని కాటేస్తానంటున్న చిరంజీవి?
Chiranjeevi ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Chiranjeevi: ఆ కుర్ర బ్యూటీతో సూపర్ హాట్ సాంగ్ కి స్టెప్పులేయనున్న మెగాస్టార్.. థియేటర్స్‌లో పూనకాలు కన్ఫర్మ్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ చిత్రం ‘విశ్వంభర’  (Vishwambhara). ‘బింబిసార’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వశిష్ఠ  ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మొదటిసారిగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై చిరంజీవితో కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి ఐకానిక్ చిత్రం ‘ఖైదీ’లోని ‘రగులుతోంది మొగలిపొద’ పాట రీమిక్స్ వెర్షన్ అభిమానులను అలరించనుంది.

‘నాగిని’ బ్యూటీతో చిరు హాట్ సాంగ్ 

ఆ రోజుల్లో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఈ పాటను మళ్లీ చిరంజీవి స్వయంగా రీమిక్స్‌లో చిందులేయడం అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో చిరుతో కలిసి స్టెప్పులేసే అందాల నటి ఎవరో కాదు, ‘నాగిని’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ (Mouni Roy). ఈ పాట కోసం ప్రత్యేక కొరియోగ్రఫీ రూపొందించారు. మౌనీ రాయ్ తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఊపేసేలా ఉంటుందని ఇప్పటినుంచే హైప్ అవుతోంది.

Also Read: Telugu Cinema: షూటింగ్లో అలాంటి పాడు పని చేసినందుకు హీరోని చెప్పుతో కొట్టిన స్టార్ హీరోయిన్?

ఆ ఒక్క పాటకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ 

ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని ఇస్తున్నారు. అయితే, ఈ స్పెషల్ సాంగ్ కోసం మాస్ బీట్స్‌లో పేరు తెచ్చుకున్న భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవి సరసన అందాల నటి త్రిష కీలక పాత్రలో నటిస్తుండగా, అశికా రంగనాథ్, కునాల్ కపూర్, సురభి, ఈషా చావ్లా వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

 Also Read: Kota Srinivas Rao Death: కోట శ్రీనివాసరావు మృతికి వాళ్లే కారణమా? అవకాశాలు అడిగినా ఇవ్వలేదా?

టాప్ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలు

ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్‌లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. భూలోకం, దేవలోకం, పాతాళలోకం మధ్య సాగే ఈ సోషియో-ఫాంటసీ కథాంశం ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని అందించనుందని తెలిసిన సమాచారం. సినిమాలో 70% వీఎఫ్‌ఎక్స్‌తో నిండిన అద్భుత విజువల్స్ ఉంటాయని, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నుంచి టాప్ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలు ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నాయని సినీ వర్గాల నుంచి సమాచారం.

Also Read: Air India Flight Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. తెరపైకి కొత్త అనుమానాలు.. పైలెటే మెయిన్ విలనా?

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క