Harsh Vardhan: అవమానం తట్టుకోలేక హర్ష వర్థన్ ఏం చేశారంటే?
harsha-vardhan
ఎంటర్‌టైన్‌మెంట్

Harsh Vardhan: ఆ ఈవెంట్లో అవమానం తట్టుకోలేక నటుడు హర్ష వర్థన్ ఏం చేశారంటే?

Harsh Vardhan: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి హర్ష వర్ధన్. కేవలం తెరపై కనిపించే నటుడిగానే కాకుండా, తెర వెనుక కథను నడిపించే సత్తా ఉన్న క్రియేటర్ ఆయన. అయితే, నితిన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమా విజయం హర్ష వర్ధన్ జీవితంలో ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆ సినిమా సమయంలో తాను ఎదుర్కొన్న అవమానం, అనుభవించిన బాధ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also-Om Shanti Shanti Shanti Review: తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్విటర్ రివ్యూ.. ఎలా ఉందంటే?

అసలు ఏం జరిగింది?

‘గుండె జారి గల్లంతయ్యిందే’ చిత్రానికి హర్ష వర్ధన్ కేవలం మాటల రచయిత మాత్రమే కాదు, ఆ సినిమా కథ స్క్రీన్‌ప్లేలో ఆయన పాత్ర ఎంతో కీలకం. సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు రాబట్టింది, నితిన్ కెరీర్‌కు ఊపిరి పోసింది. కానీ, ఆ సక్సెస్ సంబరాల్లో హర్ష వర్ధన్ పేరు ఎక్కడా వినిపించలేదు. సినిమా ఘనవిజయానికి కారకులైన వారిని సత్కరించే క్రమంలో తనను పూర్తిగా విస్మరించడం ఆయనను తీవ్రంగా కలచివేసింది.

గుర్తింపు లేని శ్రమ!

హర్ష వర్ధన్ మాట్లాడుతూ, “ఒక రచయిత సినిమాకు వెన్నెముక వంటివాడు. కథలో ప్రాణం పోసేది ఆయనే. కానీ సక్సెస్ మీట్స్ లేదా ఆడియో ఫంక్షన్ల వంటి బహిరంగ వేదికలపై హీరోలు లేదా దర్శకులు రచయిత పేరును ప్రస్తావించడానికి కూడా ఇష్టపడకపోవడం బాధాకరం” అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నితిన్ ప్రవర్తన గురించి ప్రస్తావిస్తూ, వేదికల మీద తన పేరు చెప్పకపోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కాలేదని వాపోయారు.

Read also-Vishwambhara: ‘విశ్వంభర’ మూవీ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన చిరు.. ఎప్పుడంటే?

హర్ష వర్ధన్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో రచయితలకు జరుగుతున్న అన్యాయాన్ని మరోసారి ఎండగట్టాయి. ఒక సినిమా హిట్ అయితే క్రెడిట్ మొత్తం హీరోకో, డైరెక్టరో ఖాతాలోకి వెళ్లిపోతుందని, తెర వెనుక కష్టపడే టెక్నీషియన్లు మాత్రం వెలుగులోకి రాలేకపోతున్నారని ఆయన ఆవేదనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంఘటన తర్వాత ఆయన చాలా కాలం పాటు కొన్ని పెద్ద ఆఫర్లను కూడా సున్నితంగా తిరస్కరించడానికి కారణం ఆత్మాభిమానమేనని అర్థమవుతుంది. అయితే ఆ తర్వాత ఇదంతా తనలోని ఏదో తెలియని శక్తి చేయిస్తుందని గ్రహించి మళ్లీ తన పాత పందా లోనికి వచ్చేశానన్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?