Power Star Pawan Kalyan
ఎంటర్‌టైన్మెంట్

AM Rathnam: ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ విడుదల వేళ.. అభిమానులకు నిర్మాత విన్నపం!

AM Rathnam: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ఎన్నో వాయిదాలు పడి, ఎంతో నిరాశ పరిచిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా.. ఎట్టకేలకు జూలై 24న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌పై మేకర్స్ దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా, చిత్ర ట్రైలర్‌తో ఆ అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లేందుకు మేకర్స్ అంతా సిద్ధం చేశారు. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ జూలై 3వ తేదీ ఉదయం 11 గంటల 10 నిమిషాలకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. 3 నిమిషాల 1 సెకను నిడివితో రాబోతున్న ఈ ట్రైలర్‌ను తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే వీరమల్లు స్క్రీనింగ్ అయ్యే థియేటర్ల లిస్ట్ బయటికి వచ్చేసింది. ఇక ట్రైలర్ విడుదలను పురస్కరించుకుని.. నిర్మాత ఏఎమ్ రత్నం అభిమానులకు ఓ విన్నపం చేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన లేఖలో..

Also Read- Shirish Reddy: రామ్ చరణ్‌ని అవమానించడమా.. అది నా జన్మలో జరగదు!

‘‘పవన్ కళ్యాణ్ అభిమానులకు మరియు ప్రేక్షకులకు,
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరి హర వీర మల్లు ట్రైలర్ విడుదల సందర్భంగా, సంవత్సరాలుగా మీరు చూపిన ప్రేమ, ఉత్సాహానికి ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు మనందరి రోజు. మీరు అందించిన ప్రేమకు అదొక మధుర క్షణం. మీ స్పందనల కోసం మేము ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాము. పవర్‌స్టార్ అభిమానులు దీనిని ఖచ్చితంగా ఆనందోత్సవాల వేడుకగా మారుస్తారని నేను నమ్ముతున్నాను. ఈ పండుగను ఉత్సాహంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని మేము విన్నవించుకుంటున్నాము. మీరు కటౌట్‌లు ఏర్పాటు చేసినా, థియేటర్లలో వేడుకలు ప్లాన్ చేసినా.. ఫస్ట్ మీ భద్రత ముఖ్యమని మరిచిపోవద్దు. మన చీఫ్ పవన్ కళ్యాణ్‌‌కు మాట రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలియజేస్తున్నాను. అలాగే థియేటర్లకూ, బహిరంగ ప్రదేశాలకూ ఎటువంటి హాని కలగకుండా చూద్దాం. ఈ వేడుకను జీవితాంతం గుర్తుంచుకునేలా చేద్దాం. ఈ ట్రైలర్‌తో ఒక గొప్ప అనుభూతిని మీకు ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము. రేపు ఉదయం 11:10 గంటలకు మీ అందరినీ కలుసుకుంటాను’’ అని ఏఎమ్ రత్నం ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ వైరల్ అవుతోంది.

Also Read- Harshali Malhotra: ‘అఖండ 2’లో ‘బజరంగీ భాయిజాన్‌’ చైల్డ్ ఆర్టిస్ట్‌.. ఇప్పుడెలా ఉందో చూశారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఫస్ట్ టైమ్ ఒక చారిత్రాత్మక యోధుడిగా నటించిన ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?