Hari Hara Veera Mallu: దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం బిజీ జీవితం గడుపుతున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతోపాటు వివిధ రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలుగు వారి కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రాన్ని రెండు రోజుల పాటు ఏపీ భవన్ లో ప్రదర్శిస్తున్నారు. వారాంతపు సెలవు దినాలు అయన శని, ఆదివారాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో రెండు షోలు వేస్తున్నట్టు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీ లవ్ అగర్వాల్ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న తెలుగు వారి కోసం ఢిల్లీలో స్థిరపడిన తెలుగు వారి కోసం చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. శనివారం రాత్రి 7 గంటలకు మొదటి షో వేయగా ఆడిటోరియం ప్రేక్షకులతో నిండిపోయింది. 27వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరో షో వేయనున్నారు. ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభించింది.
Read also- Sunil Kumar Ahuja: అక్రమ ఫైనాన్స్‌లో జిత్తులమారి.. సునీల్ కుమార్ అహుజా!
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా జూలై 24న గ్రాండ్‌గా విడుదలైంది. తొలి రోజే ప్రీమియర్ షోలు కలిపి సుమారు 44.2 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్ సాధించి పవన్ కెరీర్‌లో బెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. అయితే మిక్స్‌డ్ రివ్యూలు స్పందనల వల్ల రెండో రోజు 8 కోట్ల రూపాయలకే పరిమితమైంది. జూలై 26న సుమారు 7.4 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. మొత్తం మూడు రోజులకు భారతదేశంలో కలెక్షన్లు సుమారు 60 కోట్ల రూపాయలకు చేరగా, ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లు 70 కోట్ల రూపాయలుగా రేంజ్‌లో ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వారాంతంలో 100 కోట్ల రూపాయలు గ్రాస్ దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read also- Asia Cup: భారత్-పాక్ మధ్య 3 మ్యాచ్‌లు!.. ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఈ సినిమాకు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభించగా అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. తర్వాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఏ.ఎం. రత్నం నిర్మాతగా వ్యవహరించగా, సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందించారు. జ్ఞాన శేఖర్ వి.ఎస్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎడిటింగ్ బాధ్యతలు ప్రసన్న నిర్వహించారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలకు రామ్, లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేశారు, వీఎఫ్ఎక్స్‌ను ఆర్. సాజిద్ పర్యవేక్షించారు. కాస్ట్యూమ్స్ డిజైనింగ్ అర్చనా మిశ్రా చేసిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటించారు.