Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలకు సంబంధించి ఇప్పటికే ఎన్నో అనౌన్స్‌మెంట్స్ వచ్చాయి. కానీ అనుకున్న టైమ్‌కి సినిమాను విడుదల చేయలేకపోయారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల అంటూ ప్రకటన వచ్చినప్పటికీ, మరోసారి వాయిదా వేస్తున్నట్లుగా చెబుతూ, అందుకు కారణాలను కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు వాళ్లు విడుదల చేసిన మెసేజ్ బాగా వైరలైంది. మరో వైపు ప్రేక్షకులకు, ఆఖరికి అభిమానులకు కూడా ఈ సినిమాపై ఇంట్రస్ట్ పోయింది. ఈ సినిమాను పక్కన పెట్టి ‘ఓజీ’ సినిమాను వదలండి అంటూ కామెంట్స్ చేసే స్థాయికి వెళ్లిపోయారు. మళ్లీ వాయిదా అని చెప్పారు కానీ, కొత్తగా డేట్ ఏం ప్రకటించలేదు. ఇప్పుడా టైమ్ వచ్చేసింది. ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలయ్యేది ఎప్పుడో శనివారం తెలిసిపోనుంది.
Also Read- Kuberaa Review: ధనుష్, నాగ్, రష్మికల ‘కుబేర’ ఎలా ఉందంటే..
అవును, జూన్ 21 (శనివారం) ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లుగా నిర్మాత ఏ.ఎమ్. రత్నం తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. శనివారం ఉదయం 7 గంటల 23 నిమిషాలకు ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీ అనౌన్స్ చేస్తామని, ధర్మయుద్ధం మొదలవ్వబోతుందని ఆయన ప్రకటించారు. అయితే నెటిజన్లు మాత్రం మరోరకంగా రియాక్ట్ అవుతున్నారు. ‘ఎందుకు టైమ్ వేస్ట్.. మీరు విడుదల తేదీ చెప్పడం, మళ్లీ వాయిదా పడటం కామనే కదా? ఈ మాత్రం దానికి ఎందుకు ఇంత హడావుడి’ అన్నట్లుగా రియాక్ట్ అవుతున్నారు. నిజంగా, వాళ్ల డౌట్స్‌లో కూడా నిజం లేకపోలేదు. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా ఇలా రిలీజ్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయలేదు. అందులోనూ ఏపీ డిప్యూటీ సీఎం నటించిన సినిమాకు ఇన్ని కష్టాలు ఏంటి? అనేది అభిమానుల వాదన.
Also Read- Ayan Mukerji: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య సంఘర్షణ వల్లే.. ‘వార్ 2’ ఆలస్యం!
వాస్తవానికి ఏపీ డిప్యూటీ సీఎం హోదానే ఈ సినిమాను ఇంత వరకు తీసుకువచ్చిందని పాపం వాళ్లకి తెలియడం లేదు. ఆయన పాలిటిక్స్‌పై దృష్టి పెట్టడం వల్లే.. ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ అనుకున్న టైమ్‌కి పూర్తి చేయలేకపోయారు. ఎలా గోలా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేద్దామనుకునే టైమ్‌కి మరో ప్రాబ్లమ్. ఇలా దెబ్బ మీద దెబ్బ నిర్మాతకు తగులుతూనే ఉంది. అయినా కూడా నిర్మాత ఏ మాత్రం పట్టు కోల్పోకుండా పోరాడుతూనే ఉన్నారు. ఫైనల్‌గా అంతా రెడీ చేసి, ప్రేక్షకుల ముందుకు ‘హరి హర వీరమల్లు’ని తీసుకువచ్చేందుకు సిద్ధం చేశారు. ఈసారి నిర్మాత ప్రకటించే డేట్‌కు సినిమా పక్కాగా వస్తుంది. అందులో నో డౌట్స్ అని అంటున్నారు యూనిట్ మెంబర్స్. చూద్దాం నిర్మాత రత్నం ఏ మేరకు ఈసారి మాట నిలబెట్టుకుంటారో.
Get Ready for the Battle to begin 🔥
The sword will speak louder than silence ⚔️
Join us tomorrow at 7:23 AM for the Release Date Announcement of #HariHaraVeeraMallu 💥#HHVM #DharmaBattle #VeeraMallu
— AM Rathnam (@AMRathnamOfl) June 20, 2025
నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు