Haiku Movie: ఏగన్ హీరోగా ‘కోర్ట్ వర్సెస్ ఏ నోబడి’ ఫేం శ్రీదేవి అపల్ల, మిన్నల్ మురళి చిత్రంతో రూపొందుతున్న చిత్రం ‘హైకు’. తాజాగా ఈ సినిమా నుంచి నిర్మాతల్లో ఒకరైన డాక్టర్ అరుళనందు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు నిర్మాతలు. నిజాయితీతో, భావోద్వేగపూరిత కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా. అరుళనందు, మాథ్యో అరుళనందు ఆధ్వర్యంలో ఈ నిర్మాణ సంస్థ తమ మూడో చిత్రంగా ‘హైకు’ని ప్రకటించింది. ఈ చిత్రం తెలుగు, తమిళ, మళయాళం భాషల్లో రూపొందుతోంది. మిన్నల్ మురళి చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైన ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.
Read also-Chiranjeevi MSG: ‘మనవరప్రసాద్ గారు’ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో ‘శశిరేఖ’ కాదు.. ‘కాత్యాయనీ’..
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమిస్తే.. ఇదొక రొమాంటిక్ డ్రామా అని తెలుస్తుంది. యువతీ యువకుల్లోని అమాయకత్వంతో కూడిన ప్రేమ, విద్యార్థి జీవితంలో ఆశలు, వారు కనే కలల నేపథ్యంతో ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా రానుంది. రంగురంగుల కుర్చీలతో ఖాళీగా ఉన్న గ్యాలరీలో కూర్చున్న హీరో హీరోయిన్ మనకు కనిపిస్తున్నారు. వారి మధ్య చక్కటి కెమిస్ట్రీ మనకు పోస్టర్‌లో అందంగా కనిపిస్తోంది. ఆకాశంలో కనిపించే లవ్ సింబల్ టైటిల్‌ను సూచించే సున్నితమైన భావాన్ని తెలియజేస్తోంది. అలాగే హీరో హీరోయిన్ వెనుకగా కనిపిస్తోన్న ఫాలింగ్ సూన్ అనే లైన్ వారి ఎమోషనల్ జర్నీని సూచిస్తోంది. యువరాజ్ చిన్నసామి ఈ సినిమాకు రైటర్‌గా, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన యూత్‌కు కనెక్ట్ అయ్యేలా యూనిక్ స్టోరీ నెరేషన్‌తో ఓ ప్రత్యేకతను తీసుకొచ్చారు. హరిహరన్‌తో కలిసి స్క్రీన్ ప్లే రాశారు. అదిర్చి అరుణ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. బేబి, కోర్ట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతాన్ని సారథ్యం వహిస్తున్నారు. హృదయాన్ని హత్తుకునేలా, ఎమోషనల్ కంటెంట్ కనెక్ట్ అయ్యే సంగీతాన్ని అందిస్తున్నారు.
Read also-Nari Nari Naduma Murari: ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతికే.. మరోసారి కన్ఫర్మ్ చేసిన మేకర్స్!
జో, కోళి పన్నై చెల్ల దురై చిత్రాల అందించిన విజన్ సినిమా హౌస్ తన బ్యానర్‌లో రూపొందిస్తోన్న మూడో చిత్రమిది. యంగ్ టాలెంట్‌ను, ఆలోచనలను ఎంకరేజ్ చేస్తూ మరోసారి ఈ నిర్మాణ సంస్థ వైవిధ్యమైన సినిమాతో మన ముందుకు రానుంది. ప్రేమలోని పవిత్రత, అందమైన స్నేహం, మనల్ని మనం కనుగొనే ప్రయాణం వంటి హృదయాన్ని హత్తుకునే ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ, సరికొత్త కథ, కథనాలతో సినిమాలను రూపొందిస్తోంది. త్వరలోనే సినిమాలోని నటీనటులకు సంబంధించిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సహా ఇతర వివరాలను రిలీజ్ చేస్తామని మేకర్స్ పేర్కొన్నారు. హైకు చిత్రానికి ఏగన్ అరుళనందు ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. శ్రీనివాస్ నిరంజన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం శ్రీ దేవి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

