Gopichand33 Movie (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Gopichand33: మాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హిట్ కోసం చేయని ప్రయత్నాలు లేవు. ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గోపీచంద్33’ (Gopichand33)లో నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ (Srinivasa Silver Screen) బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి (Srinivasa Chitturi) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే భారీగా అంచనాలను ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత విడుదలైన పోస్టర్ కూడా, ఇప్పటి వరకు గోపీచంద్ చేయని పాత్రలో చేస్తున్నట్లుగా అందరికీ పరిచయం చేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ తెలియజేశారు.

Also Read- Sankranthi Movies: సంక్రాంతి రేసు నుంచి రాజు తప్పుకుంటున్నాడా? కారణం ఆ తమిళ హీరోనేనా?

ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్‌

ఈ చిత్రం ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్, 55 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకుందని, ప్రస్తుతం హీరో గోపీచంద్‌తో పాటు ప్రధాన తారాగణంపై వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నారని అధికారికంగా మేకర్స్ తెలిపారు. ఈ యాక్షన్ ఎపిసోడ్.. సినిమాలో మెయిన్ హైలైట్‌గా నిలుస్తుందని, ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని చెప్పుకొచ్చారు. ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు భారీగా ఖర్చు పెడుతున్నారని, ఖర్చుకు తగినట్లే అద్భుతంగా సీక్వెన్స్ వస్తుందని అంటున్నారు. మొత్తంగా చూస్తే, గోపీచంద్ నుంచి ప్రేక్షకులు ఏమేం కావాలని కోరుకుంటారో.. అవన్నీ ఉంటూనే, ఒక సరికొత్త ప్రపంచంలోని ప్రేక్షకులను ఈ సినిమా తీసుకెళుతుందని మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇటీవల గోపిచంద్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్, గ్లింప్స్ వీడియో కూడా అదే విషయాన్ని తెలియజేశాయి. వీటికి వచ్చిన స్పందనతో టీమ్ కూడా చాలా హ్యాపీగా ఉంది.

Also Read- Gummadi Narsaiah: నిజాయితీకి మారుపేరైన ఈ ఎమ్మెల్యే బయోపిక్ చేయడానికి తెలుగులో హీరోలే లేరా?

ఫస్ట్ టైమ్ యోధుడిలా గోపీచంద్

ఇందులో యోధుడిలా కనిపించిన గోపీచంద్ తన పాత్రలోని ఇంటెన్స్‌ని ప్రజెంట్ చేశారు. ఇది గోపీచంద్ కెరీర్‌కు ఎంతో ముఖ్యమైన చిత్రం. అందుకే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదని, గోపీచంద్ కూడా ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నారని తెలుస్తోంది. విభిన్నమైన కథలతో, సాంకేతిక నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి.. ఈ చిత్రంతో భారత చరిత్రలోని ప్రాముఖ్యమైన అధ్యాయాన్ని వెండితెరపైకి తీసుకురాబోతున్నారు. అద్భుతమైన ఎమోషన్స్, విజువల్ గ్రాండియర్‌‌‌గా ఈ సినిమాను ఆయన తీర్చిదిద్దుతున్నారు. ప్రేక్షకులకు ఒక వినూత్న అనుభూతిని అందించేలా ఈ సినిమాను ఆయన సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది ఈ సినిమాకు టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, అనుదీప్ దేవ్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన హైలెట్స్‌గా ఉంటాయని చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!