Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎన్నో ఆశలతో చేసిన ‘గేమ్ చేంజర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. దీంతో మరోసారి తన సత్తా చాటాల్సిన అవసరం బాక్సాఫీస్ వద్ద ఏర్పడింది. ఎందుకంటే, స్టార్ హీరోలలో తనతో కాంపిటేషన్ ఉన్న ఎన్టీఆర్, అల్లు అర్జున్ మంచి హిట్స్ కొట్టి, రేసులో ఒకడుగు ముందుకు వేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రాజమౌళి ఖాతాలోకి వెళ్లిపోతే.. ఇప్పుడు సోలో హీరోగా రామ్ చరణ్ ఒక సాలిడ్ హిట్‌తో కమ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంది. అది ‘గేమ్ చేంజర్’తో జరుగుతుందని అంతా భావించారు. శంకర్ వంటి దిగ్గజంతో చేసిన ఆ సినిమా, అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు. దీంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన అభిమానుల ఆశలన్నీ ప్రస్తుతం బుచ్చిబాబు సానాతో చేస్తున్న ‘పెద్ది’పైనే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న వార్తలు, విడుదలైన కంటెంట్ చూస్తుంటే.. మరోసారి రామ్ చరణ్ పేరు వరల్డ్ వైడ్‌గా మోతమోగడం కాయం అనేది తెలిసిపోతుంది. అందుకు నిదర్శనం తాజాగా వచ్చిన ‘పెద్ది’ ఫస్ట్ షాటే.
Also Read- Peddi First Shot: ఇది కదా కావాల్సింది.. ‘పెద్ది ఫస్ట్ షాట్’ ఫ్యాన్స్‌కి పండగే!
‘ఒకే పని సెసేనాకి
ఒకే నాగ బతికేనాకి
ఇంత పెద్ద బతుకెందుకు
ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసేయాలా
పుడతామా ఏటి… మళ్ళీ
సెప్మీ!” అంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్‌తో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చిన ‘పెద్ది’ ఫస్ట్ షాట్ సంచలనానికి కేరాఫ్ అడ్రస్‌గా దూసుకెళుతోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. బలమైన నేపథ్యం, చిత్ర బృందంతో రూపొందుతోన్న ‘పెద్ది’.. భారతీయ సినిమాలో ప్రత్యేక చిత్రంగా సెన్సేషన్స్‌కి నాంది పలుకబోతుందని ఈ ఫస్ట్ షాట్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
‘పెద్ది’ ఫస్ట్ షాట్ గమనిస్తే.. భారీ జన సమూహం రామ్ చరణ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తూ కేరింతలు కొడుతుంటారు. అందరూ ఆశ్చర్యపోయేలా, పవర్‌ప్యాక్డ్ ఎంట్రీతో భుజంపై బ్యాట్‌ను తీసుకొస్తూ, బీడీ తాగుతూ తిరుగులేని ఆత్మవిశ్వాసంతో హీరో క్రికెట్ మైదానంలోకి అడుగు పెడతాడు. ఈ ఎంట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక చరణ్ డిఫరెంట్ యాసతో చెప్పిన డైలాగ్ డెలివరీ సన్నివేశాన్ని మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. చరణ్ చెప్పిన ఆ సింగిల్ డైలాగ్ చాలా పవర్‌ఫుల్‌గా, ప్రభావవంతంగా ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చరణ్ కెరీర్‌లో ‘రంగస్థలం’ చిత్రాన్ని మించిన చిత్రం లోడవుతుందనేది ఈ ఫస్ట్ షాట్‌తో తెలిసిపోతుంది.
ఇక ఈ ఫస్ట్ షాట్‌లో రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడుకుంటే.. చరణ్ పొలాల్లో పరిగెడుతూ వచ్చి, గోని సంచిని చించి చేతికి చుట్టుకుంటూ, చివరగా క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టాడు. అలాగే క్రికెట్ క్రీజ్ నుంచి బయటకు వచ్చి బ్యాట్ హ్యాండిల్‌ను నేలపై కొట్టి, బంతిని బలంగా బాదితే అది బౌండరీ లైన్ అవతల పడినట్లుగా ఉన్న ఈ సీన్ గూజ్ బంప్స్‌ను తెప్పిస్తుంది. సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా? అనే కోరిక కలుగుతుందంటే, చరణ్ ఎంతగా జీవించాడో అర్థం చేసుకోవచ్చు.
Also Read- Ramam: ‘విశ్వం’ తర్వాత ‘రామం’.. ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్!
రామ్ చరణ్ రగ్డ్ లుక్, పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, ముక్కుకి ధరించిన రింగు ఇవన్నీ రానెస్, పాత్రలోని ఇంటెన్సిటీని తెలుపుతున్నాయి. రామ్ చరణ్ డైలాగ్ డెలివరీ, డిక్షన్, బాడీ లాంగ్వేజ్, విజయనగరం యాస అన్నీ కూడా అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్‌కు సూచనలుగా ఉన్నాయి. మొత్తంగా అయితే.. రామ్ చరణ్ అద్భుతమైన, మాస్ అప్పీల్‌తో కూడిన నటన.. బుచ్చిబాబు రైటింగ్, టేకింగ్, సాంకేతిక నిపుణుల అత్యద్భుతమైన పనితనంతో వచ్చిన ఈ ఫస్ట్ షాట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచడంలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 27 మార్చి, 2026న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లుగా ఈ ఫస్ట్ షాట్‌లో మేకర్స్ వెల్లడించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు