Ghaati Trailer: స్వీటీ అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఘాటి’. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ఇప్పటి వరకు ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి రిలీజ్ డేట్‌లో ఎటువంటి మార్పులు ఉండవని మేకర్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. తమిళ స్టార్ హీరో విక్రమ్ ప్రభు ఇంటెన్స్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను UV క్రియేషన్స్ సమర్పిస్తుండగా.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ఫిల్మ్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ని బుధవారం (ఆగస్ట్ 6) మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే.. (Ghaati Trailer Review)
Also Read- War 2: ‘వార్ 2’ మేకర్స్ పెద్ద ప్లానే వేశారుగా.. ‘కూలీ’ ఇక ఢమాల్!
ఇప్పటి వరకు అనుష్కను జేజమ్మగా, అరుంధతిగా, ఇంకా అనేక వేరియేషన్స్‌లో చూశారు. కానీ ఈసారి అనుష్క వేరే లెవల్ పాత్రలో నటించినట్లుగా ఈ ట్రైలర్ క్లారిటీ ఇచ్చేసింది. ముందు చాలా సాఫ్ట్‌గా కనిపించిన అనుష్క.. ఆ తర్వాత ఒక్కసారిగా పూనకం వచ్చిన అమ్మవారిలా ఊచకోత మొదలు పెట్టడం చూస్తుంటే.. వెంటనే ఈ సినిమా చూసేయాలనేంత క్యూరియాసిటీ ఈ ట్రైలర్‌ని కలిగిస్తోంది. ‘‘ఈ ఘాట్‌లలో ఘాటీలు ఉంటారు సార్. బ్రిటీష్ కాలంలో కొండలు బద్దలు కొట్టి.. రక్తంతో రోడ్లు వేసినోళ్లు.. ఇప్పుడు గంజాయి మోసే కంచర గాడిదలు. వీళ్లూ కదిలే కొండలు సార్..’’ అని ఘాటి అర్థాన్ని ట్రైలర్ స్టారింగ్ వచ్చే వాయిస్ ఓవర్‌తోనే పరిచయం చేశారు. ఆ తర్వాత ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటనేది.. ‘ఈ తూర్పు కనుమల్లో ఒక కొండ నీడ.. ఇంకో కొండ మీద పడుతుంది. ఆ నీడలో షీలావతి పెరుగుతుంది. బ్లాక్ గోల్డ్ మైన్’ అనే డైలాగ్‌తో రివీల్ చేశారు.
Also Read- Manchu Manoj: మంచు మనోజ్ సోలో హీరోగా.. పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్!
మధ్యలో అనుష్క, విక్రమ్ ప్రభుల ప్రేమకథని పరిచయం చేస్తూనే.. ట్రైలర్‌ను సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్లారు. ‘మీ ఘాటీలకు పెంచడం, దాటించడం తెలిస్తే చాలు. బిజినెస్ మీ బతుకులకు సెట్ కాదు’ అనే డైలాగ్‌లో పెత్తందార్ల అజమాయిషీని చాలా కొత్తగా చూపించారు. వారంతా ఘాటీలపై దాడి చేయడం, పోలీస్ స్టేషన్లో అనుష్కను వేధించడం వంటి సీన్లతో సినిమా మూడ్‌ని మార్చేసి.. ‘ఘాటీలంటే గతిలేనోళ్లం కాదు.. గసాగసీ వస్తే.. గొంతుముడి కొరికేసి గోరీ కట్టేటోళ్లం’ అనే డైలాగ్‌లో ఘాటీల ఎదురుదాడి ఎలా ఉంటుందో.. ఇంటెన్స్ సీన్లతో రక్తి కట్టించారు. ఇక ఒంటరిగా అనుష్క చేసే పోరాట ఘట్టాలు అయితే అబ్బురపరిచేలా ఉన్నాయి. ఫైనల్‌గా వచ్చిన డైలాగ్.. ‘సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటదో చూద్దురు గానీ!’ అంటూ అనుష్క ఊచకోతని చూపించిన తీరు చూస్తే.. అనుష్క ఖాతాలో మరో బంపర్ హిట్ పడబోతుందనే ఫీల్‌ని ఇచ్చేస్తుంది. మొత్తంగా అయితే.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేయడంలో ఈ ట్రైలర్ నూటికి నూరు శాతం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక.. సీతమ్మోరు రాక కోసం వేచి చూసుడే!
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు