Vikram Prabhu
ఎంటర్‌టైన్మెంట్

Vikram Prabhu: తెలుగులో ఆ హీరోలకు పెద్ద అభిమానిని.. ‘ఘాటీ’ హీరో!

Vikram Prabhu: స్వీటీ అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా చిత్రం ‘ఘాటీ’ (Ghaati). ఈ సినిమాతో తమిళ నటుడు విక్రమ్ ప్రభు (Vikram Prabhu) మేల్ లీడ్‌గా నటిస్తున్నారు. ఇదే విక్రమ్ ప్రభు నటిస్తున్న డైరెక్ట్ తెలుగు చిత్రం. ఈ సినిమాను విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా హ్యూజ్ బజ్ క్రియేట్ చేయగా.. సెప్టెంబర్ 5న ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలోకి తెచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విక్రమ్ ప్రభు తెలుగు మీడియాకు ఈ చిత్ర విశేషాలను తెలిపారు. ఆయన మాట్లాడుతూ..

Also Read- 50 Years for Balakrishna: కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా! ఈ డైలాగ్ రజినీకాంత్ చెబితే!

అరగంటసేపు స్టోరీ చెప్పారు
‘‘ఈ సినిమా నేను చేయడానికి కారణం డైరెక్టర్ క్రిష్. ఆయన నన్ను కలిసి కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆయన చాలా పాజిటివ్ పర్సన్. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న దర్శకుడు. నాకు కథ చెప్పడానికి ముందు ‘ఘాటీ’ వరల్డ్ ఎలా ఉంటుందో చూపించారు. అలాగే ఈ రోల్‌కు నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారో కూడా అరగంటసేపు చాలా క్లియర్‌గా వివరించారు. హైదరాబాద్‌లో నాకున్న ఫ్యాన్ బేస్ గురించి చెబుతూ.. నిన్ను దృష్టిలో పెట్టుకునే ‘దేశిరాజు’ క్యారెక్టర్ రాశానని అన్నారు. ఆ మాట నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఆ తర్వాత ఆయన స్క్రిప్ట్ చెప్పారు. ఈ స్క్రిప్ట్ చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ‘ఘాటీ’ వరల్డ్ ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యేలా ఉంటుంది. ఇందులో నా అభిమాన నటి అనుష్క ఉండడం, ఆమెతో కలిసి నటించడం చాలా హ్యాపీగా అనిపించింది.

మెగాస్టార్, కింగ్‌లకు అభిమానిని
నేను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలకు పెద్ద అభిమానిని. వాళ్ల సినిమాలు ఎన్నోసార్లు థియేటర్‌లో చూశా. అలాంటి టాలీవుడ్‌లో ఇప్పుడు నేను డైరెక్ట్ సినిమా చేస్తుండటం చాలా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తోంది. వాస్తవానికి తెలుగు సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ నా లైఫ్‌లో ఏదీ ప్లాన్ ప్రకారం జరగలేదు. డైరెక్టర్ అవుదామనుకుంటే నటుడిని అయ్యా. అందుకే నా హార్ట్ ఏం చెబితే అదే చేసుకుంటూ వెళ్లిపోతున్నా.

Also Read- Terrorist Killed: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని ఖతం చేసిన భద్రతా బలగాలు.. ‘హ్యుమన్ జీపీఎస్’గా పిలిచే ఆ టెర్రరిస్ట్ గురించి తెలిస్తే..

గోన గన్నారెడ్డిగా నేనే చేయాలి
అనుష్కతో కలిసి నటించే ఛాన్స్ గతంలో ఒకసారి మిస్ అయింది. ‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్రను గుణశేఖర్ ఫస్ట్ నాకే చెప్పారు. కానీ అప్పుడు కుదరలేదు. అల్లు అర్జున్ ఆ పాత్రకు వందశాతం న్యాయం చేశారనిపించింది. ‘ఘాటి’లో నేను చేసిన పాత్ర నాకే కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ని ఇచ్చింది. అలాగే నేను మాట్లాడే భాష కూడా చాలెంజింగ్‌గా అనిపించింది. సెప్టెంబర్ 5న వస్తున్న ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?