Gamblers: ‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో హీరోగా తనకంటూ ఒక గుర్తింపుని సొంతం చేసుకున్న యూత్‌ఫుల్ క్రేజీ హీరో సంగీత్ శోభన్ (Sangeeth Shobhan. ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘గ్యాంబ్లర్స్’. ప్రశాంతి చారులింగా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ‘కేసీఆర్’ ఫేమ్ రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో ‘శ్రీవల్లి’ అనే సైన్స్ ఫిక్షన్ సినిమాను నిర్మించిన నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్ బృందావనం ఈ సినిమాను రేష్మాస్ స్టూడియోస్, స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. కేఎస్‌కే చైతన్య (KSK Chaitanya) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా మేకర్స్ సినిమా కాన్సెప్ట్ థీమ్ సాంగ్ ‘రాజు ఒక్కడు రాణి ఒక్కతి’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
Also Read- Gaddar Film Awards 2024: గద్దర్ అవార్డ్స్ ప్రకటనతో.. ఓటీటీ సంస్థ సంబరాలు చేసుకుంటోంది
‘‘రా రా మూడు ముక్కలాటలోన వింత చూడరా..
రా రా రంగు బొమ్మలాటలోన మాయ చూడరా..
అంకెలు, బొమ్మలు.. ఒంటిగా పంచగా.. జంటగా సర్దుకోవాలిగా..
లోకమే మాయరా.. చిక్కులే తెచ్చెరా.. లెక్కలే తేల్చుకో ముందుగా
రేపని, మాపని వాయిదా వేయక.. నీదనే ఈ క్షణం సాక్షిగా..
ఎవ్వరూ చూడని మలుపులే తిప్పగ.. దారికే తెచ్చుకో తెలివిగా
రాజు ఒక్కడు.. రాణి ఒక్కతి.. గొప్ప ఎవరని జోకరన్నది’’ అంటూ సాగే ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించగా.. సాయిదేవ హర్ష, శశాంక్ తిరుపతి, వినాయక్, జీకే సంపత్, జయశ్రీ ఆలపించారు. శశాంక్ తిరుపతి బాణీలు సమకూర్చారు. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Also Read- Gaddar Film Awards: ఉత్తమ నటుడిగా అవార్డ్.. అల్లు అర్జున్ స్పందనిదే!
ఈ పాట విడుదల సందర్భంగా దర్శకుడు కేఎస్‌కే చైతన్య మాట్లాడుతూ.. ‘‘ఇది చిత్ర కాన్సెప్ట్ థీమ్ సాంగ్. ఈ సాంగ్ సినిమా కాన్సెప్ట్‌ను థీమ్ ఏంటనేది తెలియజేస్తుంది. ఈ సాంగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచే విధంగా ఉంటుంది. ‘గ్యాంబ్లర్స్’ మిస్టరీ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ చాలా కొత్తగా కనిపిస్తారు. ఆయన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. ఈ సినిమాలో ఉండే థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయని అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ప్రస్తుతం సంగీత్ శోభన్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రను ఈ సినిమాలో చేస్తున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో, పూర్తి థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన ఈ ‘గ్యాంబ్లర్స్’ తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకముందని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు