Gadhadhari Hanuman(image source :x)
ఎంటర్‌టైన్మెంట్

Gadhadhari Hanuman: విడుదలైన ‘గదాధారి హనుమాన్’ టీజర్… అదిరిందిగా!

Gadhadhari Hanuman: ఈ మధ్య కాలంలో పురాణ గాధలతో రూపొందుతున్న సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. హనుమాన్ సినిమా కూడా సాధారణ సినిమాలా వచ్చి అసాధారణ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే కోవలోకి రాబోతుంది ‘గదాధారి హనుమాన్’ సినిమా. ఈ సినిమా టైటిల్ చూస్తుంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్ ను పోలి ఉంది. టైటిల్ చూస్తుంటేనే చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. దాంట్లోనూ అందరినీ రక్షించే హనుమంతుడిపై కథ ఉండటంతో.. ఇప్పటికే ‘టైటిల్’ ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివిటీని సొంతం చేసుకుంది. విరభ్ స్టూడియో బ్యానర్‌పై రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి సంయుక్తంగా ‘గదాధారి హనుమాన్’ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రోహిత్ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ను ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్ విడుదల చేశారు. నిర్మాత రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Read also- Warangal MGM hospital: ఎంజీఎం హస్పిటల్‌లో దారుణం.. బతికి ఉన్న వక్తి చనిపోయాడని తెలిపిన సిబ్బంది

‘గదాధారి హనుమాన్’ సినిమా టీజర్ విడుదల చేసిన ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘హనుమాన్’ సినిమాను నేనే ప్రారంభించాను. అది ఎంతటి హిట్ సాధించిందో మీకు తెలుసు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మకు అదో సెంటిమెంట్‌గా మారింది. హనుమాన్‌ను నమ్ముకున్న వారంతా విజయాన్ని సాధిస్తారు.’ అని అన్నారు. నిర్మాతలు రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి మాట్లాడుతూ.. ‘దర్శకుడు రోహిత్ విజన్‌కు తగ్గట్టుగా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. బీజీఎం అయితే నెక్ట్స్ లెవెల్లో ఉండబోతుంది. విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం.’ అని అన్నారు. ‘గదాధారి హనుమాన్’ సినిమాతో మూడేళ్లు ప్రయాణం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. చాలా సింపుల్ కాన్సెప్ట్‌తో మూవీ తీయాలనుకున్నాం. కానీ హనుమంతుని ఆశీస్సులతో మూడు భాషల్లో తీయగలిగామని దర్శకుడు రోహిత్ కొల్లి అన్నారు.

Read also- England player on Gill: ఇంగ్లాండ్‌తో బంతి వివాదం.. భారత్‌పై కనికరం లేదంటూ మాజీ క్రికెటర్ ఫైర్!

తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ అంచనాలు మించి ఉంది. అందులో సినిమా టీం పనితనం కనిపిస్తుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా డెడికేషన్ తో పనిచేశారని తెలుస్తుంది. మ్యూజిక్ ను సినిమాకు తగ్గట్టుగా కంపోజ్ చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ వీక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. ఓవరాల్ గా ఈ టీజర్ చూస్తుంటే మరో మంచి సినిమా టాలీవుడ్ నుంచి రాబోతుందని సినిమా క్రిటిక్స్ కితాబిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు