TGFA Awards: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ (TGFA) – 2025’ కు సంబంధించి ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. జనవరి 21, 2026 నుంచి ఈ అవార్డులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. దీనికి జనవరి 31, 2026 చివరి తేదీ. పూర్తి చేసిన దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి 3, 2026 (మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 మధ్య సెన్సార్ (CBFC) పూర్తి చేసుకున్న తెలుగు చిత్రాలు ఈ అవార్డులకు అర్హమైనవి. మొత్తం 17 ప్రధాన విభాగాల్లో అవార్డులు ఇవ్వనున్నారు. ఇందులో ఫీచర్ ఫిల్మ్స్, చిల్డ్రన్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్ వంటి కేటగిరీలు కూడా ఉన్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులకు (Technicians) ఇచ్చే వ్యక్తిగత అవార్డుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి నుంచి ‘ఉత్తమ సామాజిక సందేశాత్మక చిత్రం’ (Best Social Message Film) అనే కొత్త కేటగిరీని చేర్చారు. అలాగే డాక్టర్ సి. నారాయణ రెడ్డి పేరుతో ప్రత్యేక అవార్డును కూడా అందజేయనున్నారు.
Read also-VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు
హైదరాబాద్‌లోని ఏసీ గార్డ్స్‌లో ఉన్న ‘తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలు లభిస్తాయి. దరఖాస్తు ఫీజుగా రూ. 5,900 (GST కలిపి) చెల్లించాల్సి ఉంటుంది. దీనిని డిమాండ్ డ్రాఫ్ట్ (DD) లేదా UPI ద్వారా ‘Managing Director, TFDC’ పేరుతో చెల్లించాలి. పూర్తి చేసిన దరఖాస్తులను అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి ఫిబ్రవరి 3వ తేదీ లోపు TFDC కార్యాలయంలో సమర్పించాలి. ప్రధాన అవార్డుల కేటగిరీల జాబితా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (మొదటి, రెండు, మూడు స్థానాలు) ఇలా ఉన్నాయి. ఉత్తమ ఉర్దూ చిత్రం, జాతీయ సమగ్రతను చాటిచెప్పే చిత్రాలు, పర్యావరణం, వారసత్వం, చరిత్ర ఆధారిత చిత్రాలు, ఉత్తమ డెబ్యూ చిత్రం, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్ ఉత్తమ పుస్తకం/విశ్లేషణాత్మక వ్యాసాలు (తెలుగు సినిమాపై) నటీనటులు, సాంకేతిక నిపుణుల అవార్డులు (దర్శకుడు, హీరో, హీరోయిన్ మొదలైనవి) కూడా అందించనున్నారు. గతేడాది (2024 వరకు చిత్రాలకు) జరిగిన వేడుకలో ‘కల్కి 2898 AD’ ఉత్తమ చిత్రంగా, అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఈసారి మరింత గ్రాండ్‌గా ఈ వేడుకను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read also-Chiranjeevi MSG: మన ప్రసాద్ గారు ఫస్ట్ వీకే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టేశారోచ్.. వివరాలివే!

