Telugu Actress: మోహిని సినీ ప్రయాణం: డ్రీమ్ గర్ల్ నుంచి కఠిన అనుభవాల వరకు
తెలుగు, తమిళ, మలయాళ చిత్రసీమలో 90వ దశకంలో ‘డ్రీమ్ గర్ల్’గా హృదయాలను కొల్లగొట్టిన నటి మోహిని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా తన సినీ జీవితంలోని చేదు అనుభవాలను, కోల్పోయిన అవకాశాలను, వ్యక్తిగత జీవితంలోని సవాళ్లను ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె, బాలకృష్ణతో ‘ఆదిత్య 369’, చిరంజీవితో ‘హిట్లర్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ తో ఆడియెన్స్ మనసు గెలుచుకున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అమెరికాలో స్థిరపడి, క్రైస్తవ మత ప్రచారకురాలిగా కొత్త జీవితాన్ని గడుపుతున్న మోహిని, తన కెరీర్‌లో ఎదుర్కొన్న కొన్ని బాధాకర అనుభవాలను వెల్లడించారు.
Also Read: Ritika Nayak: హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్.. ‘మిరాయ్’లో తన పాత్ర ఏంటో చెప్పేసిన హీరోయిన్
ఆ సీన్లో నన్ను బలవంతం చేశారు?
మోహిని తన కెరీర్‌లో ఎదురైన ఒక బాధాకర సంఘటన గురించి మాట్లాడుతూ, తమిళ చిత్రం ‘కన్మణి’ షూటింగ్ సందర్భంగా జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆ చిత్ర దర్శకుడు ఆర్.కే. సెల్వమణి, స్విమ్మింగ్ పూల్ సన్నివేశం కోసం స్విమ్‌సూట్ ధరించాలని ఒత్తిడి చేశారని, తనకు ఈత రాదని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు, ఆ సీన్‌పై అసౌకర్యం ఉందని చెప్పినప్పటికీ ఆమె మాటలను ఎవరూ పట్టించుకోలేదని వెల్లడించారు. “చివరికి గుండెల నిండా బాధతో.. ఏడుస్తూ కన్నీళ్లతో ఆ సన్నివేశాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. అది తప్ప, నా కెరీర్‌లో ఎప్పుడూ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్నాను,” అని ఆమె ఆవేదనతో చెప్పుకొచ్చారు.
Also Read: MLA Dr. Rajesh Reddy: సమాజానికి సేవ చేసే జర్నలిస్టుల ఆరోగ్యం ఎంతో ముఖ్యం.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
కోల్పోయిన సినిమా అవకాశాలు
సినీ రంగంలో తనకు చేజారిన కొన్ని ముఖ్యమైన అవకాశాల గురించి కూడా మోహిని మాట్లాడుతూ బాధపడ్డారు. రజనీకాంత్ నటించిన ‘ముత్తు’, సూర్య నటించిన ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ వంటి సినిమాలో కీలక పాత్రలు తనకు రావాల్సి ఉండగా, వాటిని కోల్పోయానని చెప్పింది. “రజనీకాంత్‌ను కలవమని సలహా ఇచ్చినా, ఆ సమయంలో నేను పట్టించుకోలేదు. దాని వల్ల ఆ అవకాశం చేజారిపోయింది,” అని ఆమె విచారం వ్యక్తం చేశారు.
Also Read: CM Revanth Reddy: గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి.. అనుమతులివ్వాలని కేంద్ర మంత్రికి వినతి