Fahadh Faasil
ఎంటర్‌టైన్మెంట్

Fahadh Faasil: తర్వాత అదే చేయాలనుకుంటున్నా.. ఫహాద్‌ ఫాజిల్‌

Fahadh Faasil: ఫహాద్‌ ఫాజిల్‌ అనే పేరు తెలుగులో చాలామందికి తెలియక పోవచ్చు కానీ భన్వర్ సింగ్ షెఖావత్ అంటే మాత్రం తెలుస్తుంది. ‘పుష్ప’ సినిమాలో అంతలా పాపులర్ అయిన పాత్ర అది. పాత్ర ఏదైనా ఆయన వేశాడంటే అందులో లీనమైపోతారు. తాజాగా ఆయన వడివేలుతో కలిసి ‘మారీశన్’ సినిమాలో నటిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. కాగా ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలు పంచుకున్నారు. భవిష్యత్తులో సినిమాలకు విరామం ఇచ్చేసిన తర్వాత క్యాబ్ డ్రైవర్ గా కొనసాగుతానని చెప్పుకొచ్చారు. డ్రైవర్ గా చేయడం అంటే తన కెంతో ఇష్టం అని అది కూడా బార్సిలోనా లోనే చేస్తానని చెప్పుకొచ్చారు.

Read also- OTT Platforms: 25 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం.. కేంద్రం షాకింగ్ నిర్ణయం

‘ప్రజలను వారి వారి గమ్యస్థానాలకు చేర్చడం అంటే నాకు చాలా ఇష్టం, అది చాలా బాధ్యతతో కూడుకున్న పని. అది నా దృష్టిలో చాలా గొప్ప పని. ఆ పని ఎప్పుడూ బోర్ కొట్టదు. ప్రేక్షకులకు ఏదో సమయంలో నన్ను చూస్తే బోర్ అనిపిస్తుంది. అప్పుడు సినిమాల నుంచి విరామం తీసుకుంటా. ఆ సమయంలో నాకు బాగా నచ్చిన పని అయిన డ్రైవింగ్ చేసుకుంటా. అది కూడా నాకు ఇష్టమైన ప్రదేశంలో. అది ఎక్కడ అంతే నేను కొన్ని నెలల క్రితం స్పెయిన్‌లోని బార్సిలోనాకు వెళ్లాను. అక్కడ ప్రదేశం నాకు బాగా నచ్చింది. అక్కడ ఊబర్ క్యేబ్ నడుపుకుంటా.’ అని చెప్పారు. ఇదే విషయాన్ని తన భార్య నజ్రియాకు కూడా చెప్పినట్లు తెలిపారు. దీనికి ఆమె తరపునుంచి కూడా సానుకూలంగా స్పందన వచ్చిందని తెలిపారు. ఇదే విషయాన్ని ఇంతకు ముందు కూడా ఓ సందర్భంలో నటన కాకుండా మీకు ఏం వృత్తి అంటే ఇష్టం అని అడిగినపుడు. డ్రైవర్ అవుతానని సమాధానం ఇచ్చారు.

Read also- Gold Rates (25-07-2025): మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్

మాలయాళ దర్శకుడు సుదీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో వడివేలు, ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మారీశన్‌’. ఈ సినిమా జులై 25న ప్రేక్షకుల ముందుకువచ్చింది. తాజాగా ఈ సినిమాపై కమల్‌ హాసన్‌ కూడా ప్రశంసలు కురిపించారు. భావోద్వేగాలతో కలిసిన కామెడీ చిత్రమని మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఆలోచింపచేస్తుందన్నారు. ఫహద్ ఫాసిల్ తదుపరి తెలుగు చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఈ చిత్రం శోభు యార్లగడ్డ సమర్పణలో సిద్ధార్థ నడెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక యాక్షన్ డ్రామా చిత్రంగా రూపొందుతోంది.

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ