ENE Repeat: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi). ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని, ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకుని సంచలనాత్మక విజయం సాధించి కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమా ఇటీవల రీ రిలీజై మరింత ఎగ్జయిట్‌మెంట్‌ను క్రియేట్ చేసింది. సినిమాలోని పాత్రలు, హ్యుమర్, లైఫ్‌కి కనెక్ట్ అయ్యే కథతో ఈ చిత్రం మ్యాసీవ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాకు సీక్వెల్ గురించి దర్శకుడు తరుణ్ భాస్కర్ చెబుతూ వస్తున్నారు కానీ.. ఎప్పుడనేది చెప్పలేదు. తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ‘ENE రిపీట్’ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేయడానికి రెడీ అవుతుందనే హామీ ఇస్తోంది. ఫస్ట్ పార్ట్‌లో ఎవరైతే నటించారో.. దాదాపు ఒరిజినల్ స్టార్ కాస్ట్, టెక్నికల్ టీంమ్‌తోనే తిరిగి వస్తున్న ఈ సీక్వెల్ నోస్టాల్జియా ఫీలింగ్‌ని కలిగిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
Also Read- Actress Pakeezah: తమిళనాడు ఆధార్ ఉంది.. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ఆదుకోండి!
‘ఈ నగరానికి ఏమైంది’ మూవీతో అందరినీ అలరించిన గ్యాంగ్ విశ్వక్ సేన్ (Vishwak Sen), సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను మరోసారి.. మ్యాడ్‌నెస్ క్రియేట్ చేయబోతున్నారు. ఫస్ట్ పార్ట్‌ని తెరకెక్కించిన క్రియేటివ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై డి. సురేష్ బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఓ టీజర్ వదిలారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా ఒక హిలేరియస్ ట్రీట్‌లా ఉండటం విశేషం. ఈ మూవీ టైటిల్ ‘ENE రిపీట్’. ఈ టైటిల్ మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ప్రామిస్ చేస్తోంది.
Also Read- Manchu Vishnu: రామ్ గోపాల్ వర్మ మెసేజ్‌తో దాదాపు ఏడ్చేసిన మంచు విష్ణు.. మరీ ఇలానా టీజ్ చేసేది?
టైటిల్ లోగో విషయానికి వస్తే.. టైటిల్ లోగో తెలుగు లెటర్స్‌ని తెలివిగా మిక్స్ చేసి చూపించారు. ఇక్కడ ENE యొక్క మొదటి, చివరి అక్షరాలు తెలుగులో కనిపిస్తాయి, చివరి అక్షరాలు మాత్ర తిప్పబడి మూవీ ఆఫ్‌బీట్ టోన్‌ను ప్రజెంట్ చేస్తున్నాయి. ‘ఏలనాటి శని పోయింది, కన్యారాశి టైమ్ ఒచ్చింది’ అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్. గాలిలో ఎగిరిపోతున్న బట్టలు, బ్రీఫ్‌కేస్, బీర్ బాటిళ్లు, సన్ గ్లాసెస్, విమాన టికెట్ ఇవన్నీ ఆకాశమంత సాహసాన్ని తెలియజేస్తున్నాయి. ఇది కేవలం కొనసాగింపునే కాదు, మ్యాడ్ నెస్‌ని మరింత పెంచుతుంది. అలాగే ఎంటర్‌టైన్మెంట్, ఎనర్జీని రెట్టింపు చేస్తుందని హామీ ఇస్తుంది. ఈ సీక్వెల్‌కు వివేక్ సాగర్ సంగీతం అందించనుండగా, ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ బాధ్యతను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను శరవేగంగా జరపుకుంటోంది. త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నామని మేకర్స్ తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు