erumalai (image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Elumalai lyrical: ‘ఏలుమలై’ సినిమా నుంచి విడుదలైన లిరికల్ సాంగ్..

Elumalai lyrical: ‘ఏలుమలై’ యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన యాక్షన్, లవ్, ఫ్యామిలీ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందుతోంది. ఈ చిత్రంలో రక్షిత సోదరుడు రాన్నా హీరోగా నటిస్తున్నాడు, మహానటి ఫేమ్ ప్రియాంక్ ఆచార్ కథానాయికగా నటిస్తోంది. జగపతి బాబు, కిషోర్ కుమార్, నాగభరణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పునీత్ రంగస్వామి దర్శకత్వంలో, తరుణ్ కిషోర్ సుధీర్ సమర్పణలో, నరసింహా నాయక్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. టైటిల్ టీజర్‌ను బెంగళూరులో శివరాజ్ కుమార్ విడుదల చేయగా, పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. “చూడన్నా.. నిన్ను చూస్తుంటే వేరే ఊరి నుంచి వచ్చినట్టు అనిపిస్తోంది…” అనే డైలాగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంగీతం డి. ఇమ్మాన్ అందించగా, సినిమాటోగ్రఫీ అద్వైత గురుమూర్తి, ఎడిటింగ్ కె.ఎం. ప్రకాష్ చేశారు.

Read also- Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో యాక్షన్ సీన్స్ అదుర్స్!.. మాస్టర్ ఎవరంటే?

తాజాగా ‘ఏలుమలై’ (Elumalai) సినిమా నుంచి సిధ్ శ్రీరామ్(Sid Sriram) ఆలపించిన ‘రా చిలకా’ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు నిర్మాతలు. సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘రా చిలకా’ అనే పాట శ్రోతల్ని ఆకట్టుకునేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు డి. ఇమ్మాన్ బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఈ పాటలో చూపించిన లొకేషన్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ చూస్తుంటే ఈ చిత్రంలో అందమైన ప్రేమ కథ దాగి ఉందని అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ ‘రా చిలకా’ లిరికల్ వీడియో యూట్యూబ్‌లో అందరినీ మెప్పించేలా ఉంది. ఇప్పటి వరకు ‘ఏలుమలై’ నుంచి వచ్చిన టైటిల్ టీజర్, పోస్టర్ ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి.

Read also- GHMC WhatsApp Feature: గుడ్ న్యూస్.. ప్రాపర్టీ ట్యాక్స్ ట్రేడ్ లైసెన్స్‌ల చెల్లింపులో కొత్త విధానం

రాన్నా, ప్రియాంక ఆచార్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మాణంలో పునీత్ రంగస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ఏలుమలై’. నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను కర్ణాటక తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్, సేలం, ఈరోడ్ వంటి వివిధ ప్రదేశాలలో చిత్రీకరించారు. తమిళం, తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకున్నాయి. కథాంశం కూడా కొత్తగా ఉండనుండటంతో ఈ సినిమా మంచి ధరకే అమ్ముడుపోయే అవకాశం ఉందని సినిమా క్రిటిక్స్ చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు