Jatadhara Trailer Launch (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Sudheer Babu: ‘జటాధర’ దమ్ బిర్యానీలా తయారైంది.. పక్కా బ్లాక్ బస్టర్!

Sudheer Babu: నవ దళపతి సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్‌నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం ‘జటాధార’ (Jatadhara). నవంబర్ 7న తెలుగు, హిందీ భాషలలో రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా సూపర్‌స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ (Jatadhara Trailer) మంచి స్పందనను రాబట్టుకుంటూ.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో సుధీర్ బాబు సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Also Read- Tollywood Box Office: నాలుగు సినిమాలు రిలీజ్ అయితే.. బాక్సాఫీస్ వద్ద సందడేది? వీక్ ఓపెనింగ్స్!

దమ్ బిర్యానిలా తయారైంది

ఆయన మాట్లాడుతూ.. ‘జటాధర’ ట్రైలర్ లాంచ్ చేసిన మహేష్ బాబుకు థాంక్యూ. చిన్నప్పుడు విన్న ‘ఓ స్త్రీ రేపు రా, లంకె బిందెలు’ వంటి కథలు విన్నప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అవుతాం. వెంకట్ వచ్చి ఈ సినిమా కథ చెప్పినప్పుడు అంతే థ్రిల్ అనిపించింది. రేపు సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులు కూడా థియేటర్స్‌లో అదే థ్రిల్ ఫీల్ అవుతారు. ఇందులో అద్భుతమైన కథ ఉంది. మంచి ఎమోషన్స్ ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని చెప్పగలను. సినిమా అద్భుతంగా రావడానికి కారణమైన టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. సోనాక్షి సిన్హా చేసిన పెర్ఫార్మెన్స్.. నాకు తెలిసి ఇంకెవరు కూడా మ్యాచ్ చేయలేరు. ధన పిశాచి ఇందులో పవర్ ఫుల్ రోల్. ఆ పాత్రకి సోనాక్షి మరింత పవర్‌ని యాడ్ చేశారు. డైరెక్టర్స్ వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్‌లకు ఇది ఫెంటాస్టిక్ డెబ్యూ. క్లాస్, మాస్ అందరికీ కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ ఇది. పక్కాగా తెలుగు, హిందీలో ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఇందులో శిల్పా శిరోద్కర్ పాత్ర చూస్తే భయమేస్తుంది. ఈ సినిమా ఒక దమ్ బిర్యానిలా తయారైంది. ఆడియన్స్ మనీ, టైమ్‌కి వేల్యూ ఇచ్చినప్పుడు.. ఆ సినిమా 100 శాతం బ్లాక్ బస్టర్. ‘జటాధర’ కూడా 100 శాతం బ్లాక్ బస్టర్ సినిమా. నవంబర్ 7న ఇంట్లో ఉన్న అందరితో సినిమాకు వెళ్లండి. ఈ సినిమా చూసిన వాళ్లంతా మమ్మల్ని పొగుడుతారని చెప్పుకొచ్చారు.

Also Read- Bigg Boss Telugu 9: కెప్టెన్సీ టాస్క్, కెప్టెన్సీ ఛాలెంజ్.. ఆయేషా అతి మాములుగా లేదు, ట్విస్ట్ అదిరింది

ధన పిశాచి తరహా పాత్ర చేయలేదు

హీరోయిన్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) మాట్లాడుతూ.. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా, నాకు చాలా స్పెషల్. ఇంత అద్భుతమైన టీమ్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరి సపోర్ట్‌కు థాంక్యూ. ‘జటాధర’ సినిమాని తప్పకుండా థియేటర్స్ చూడండి. అందరికీ నచ్చుతుంది. సుధీర్ బాబుతో కలిసి నటించడం వండర్ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. ధన పిశాచి వంటి పాత్రను నేను ఇప్పటివరకూ చేయలేదు. ఒక యాక్టర్‌గా ఇలాంటి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి పాత్రకు నన్ను ఎన్నుకున్న వారందరికీ థ్యాంక్యూ అని చెప్పారు. శిల్పా శిరోద్కర్ మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ‘బ్రహ్మ’ నా ఫస్ట్ తెలుగు రిలీజ్. మళ్లీ ‘జటాధర’తో వస్తున్నందుకు చాలా హ్యాపీ. ప్రతి ఒక్కరు మీ ప్రేమ, సపోర్ట్‌ని అందిస్తారని కోరుకుంటున్నాను. మహేష్ బాబు ట్రైలర్ లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. ఇండస్ట్రీలోకి మళ్ళీ వెల్కమ్ చేశారు. ఇది మాకు చాలా స్పెషల్.. అని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్

Street Dog Attacks: వీధి కుక్కల స్వైర విహారం.. ఎంతదారుణం!