Natti Kumar: ఏపీ ప్రభుత్వంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు సమావేశం కాబోతున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిర్మాత నట్టి కుమార్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu)కు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ (Kandula Durgesh)కు, ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ (Nara Lokesh)కు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ విజ్ఞాపన పత్రాన్ని మీడియాకు విడుదల చేశారు. ఇదే పత్రాన్ని ఏపీ ప్రభుత్వ పెద్దలకు అందజేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ పత్రంలో..
‘‘తెలుగు సినీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ, మాజీ ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్, తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, ఫిలిం డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అయిన నట్టి కుమార్ అనే నేను మీ దృష్టికి ఈ క్రింది విషయాలను తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నమిది.
Also Read- Sanjay Kapur: కరిష్మా కపూర్ మాజీ భర్త మృతి.. కారణం తెలిస్తే షాకవుతారు
ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంల ఆధ్వర్యంలో జూన్ 15న (ఆదివారం) తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేయడం శుభపరిణామం. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. దాదాపు పదిరోజుల క్రితం మాట్లాడిన మాటల్లో ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ ఆధ్వర్యంలో మాత్రమే ప్రభుత్వాన్ని కలవాలని చెప్పారు. అలా ఆయన చెప్పడం నిజంగా సంతోషాన్నిచ్చింది. కానీ ఆ తర్వాత ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ జరిగిందో తెలియదు కానీ.. సినీ పరిశ్రమకు చెందిన పెద్ద సినిమా వాళ్లను మాత్రమే ఆదివారం జరిగే మీటింగ్‌కు దాదాపు 52 మందిని ఆహ్వానించారు సినిమాటోగ్రఫీ మంత్రి. ఆయన పిలుపులో పెద్ద నిర్మాతలు, పెద్ద డైరెక్టర్స్, పెద్ద హీరోలు తప్ప.. చిన్న చిత్రాల నిర్మాతలకు ప్రాతినిధ్యమే లేకపోవడం బాధాకరమైన విషయం. గత ప్రభుత్వంలో కూడా ఇలాగే చేశారు. అదే మిస్టేక్‌ని మళ్లీ చేస్తున్నారు.
చిన్న సినిమాల నిర్మాతల సమస్యలు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత, తమ సమస్యలు పరిష్కారం అవుతాయని చిన్న చిత్రాల నిర్మాతలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా చిన్న చిత్రాల నిర్మాతలు సుదీర్ఘంగా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటో తమరి దృష్టికి తీసుకుని వస్తున్నాను. దయచేసి పెద్ద మనసుతో చిన్న చిత్రాల నిర్మాతల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా తమరికి మనవి చేస్తున్నాను.
సినిమా థియేటర్లలో 5 షోలకు సంబంధించి, మధ్యాహ్నం 2-30 గంటల షోను తప్పనిసరిగా చిన్న చిత్రాలకు కేటాయించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉంది. 175 స్క్రీన్స్ లోపు రిలీజ్ చేసే చిన్న చిత్రాలకు 2-30 గంటల షోను కేటాయించామని పోరాటం జరుగుతూనే ఉంది.
Also Read- Priya Naidu: పని ఇవ్వని వాడే ఎక్కడ పడితే అక్కడ చేతులేసి నొక్కుతాడు
అలాగే మల్టీఫ్లెక్స్‌లలో సీటింగ్ కెపాసిటీలో 20 శాతం ఆక్యుపెన్సీ టిక్కెట్ ధరను 75/- రూపాయలుగా నిర్ణయిస్తూ జీవో ఉన్నప్పటికీ, దానిని ఎవరూ అమలు పరచడం లేదు. ముఖ్యంగా ఈ రెండు సమస్యలు పరిష్కారం కావాలన్నది చిన్న చిత్రాల నిర్మాతల కల.
వాస్తవానికి చిత్ర పరిశ్రమలో ఏడాదికి సరాసరి 200 సినిమాలు నిర్మాణం జరిగితే.. అందులో 150 వరకు చిన్న సినిమాలే ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. చిన్న చిత్రాలను ఆధారం చేసుకునే ఎంతోమంది సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు, కార్మికులు జీవనం సాగిస్తున్నారు. కానీ, చిన్న చిత్రాల నిర్మాతల సమస్యలు మాత్రం అలాగే వదిలేస్తున్నారు. వీటిని పరిశీలించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇక ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే మీటింగ్‌కు వస్తున్న సినీ పెద్దలకు 35 శాతం సినిమా షూటింగ్ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లోనే జరపాలని ఆదేశించాలని కోరుతున్నాను. వాస్తవానికి ఏపీ నుంచి సినిమా రెవిన్యూ 68 శాతం పరిశ్రమకు లభిస్తే, 32 శాతం నైజాం నుంచి లభిస్తోంది. ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ, అలాగే టూరిజం అభివృద్ధి చెందాలంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. GSTని కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే కట్టే విధంగా సినీ పెద్దలకు సూచించాలని కోరుతున్నాను. వీటివల్ల ఏపీలో ఎంప్లాయిమెంట్ పెరుగుతుంది. ఏపీకి చెందిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, అలాగే సినీపరిశ్రమ, చిన్న చిత్రాల నిర్మాతలకు మేలు జరగాలన్న సదాశయంతో ఈ విజ్ఞాపన పత్రాన్ని రాయడం, మీ దృష్టికి తేవడం జరుగుతోంది.’’ అని నట్టి కుమార్ ఇందులో పేర్కొన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు