Maruthi responds: ప్రభాస్ అభిమానులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రానే వచ్చింది. ఈ ట్రైలర్ ప్రభాస్ ప్యాన్స్ కు ఫీస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అయితే కొంత మంది ఈ ట్రైలర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. ట్విటర్ వేదికగా ఓ అభిమాని చేసిన కామెంట్ కు దర్శకుడు మారుతి స్పందించారు. కామెంట్ లో ఏం ఉందంటే.. ఈ సారి హర్రర్ కమెడీ తో నడుచుకుంటూ వచ్చి రూ.1000 కోట్టు కలెక్షన్స్ కొట్టేస్తున్నాం అంటూ కామెంట్ చేశారు. దానికి మారుతి స్పందించారు. మీ అభిమానం పదివేల కోట్లతో సమానం. నేనే గొప్పకోసం, కలెక్షన్లను పట్టించుకోను. మీ అందరికీ కింగ్ సైస్ వినోదం అందించడమే నా లక్ష్యం. అభిమానుల ఆకలి ఖచ్చితంగా ఈ సినిమాతో తీరుతుంది. రాబోయే నాలుగు నెలల్లో ఇలాంటి అప్డేట్ కోసం ఎదురు చూడండి సినిమా చాలా బాగా వచ్చింది. బిగ్ స్కీన్ పై మిమ్మల్ని మెప్పిస్తుంది.’ అంటూ రాసుకొచ్చారు. ట్రైలర్ పై వస్తున్న మిక్సడ్ రివ్యూల నేపధ్యంలో మారుతి ఈ విధమైన కామెంట్ చేశాడని నెటిజన్లు అంటున్నారు. అయితే ఈ సినిమా మరిన్ని అప్డేట్ల కోసం వేచి ఉండాల్సిందే.
Mee abhimanam 10000cr lekka
I won't care about records or collections
All I want to provide KINGSIZE entertainment and satisfy ur hunger it's just a Trailer before 4 months .
Stay tuned for bigger things #TheRajaSaab https://t.co/ziddZ8AQjL— Director Maruthi (@DirectorMaruthi) September 29, 2025
Read also-Local Body Elections: నాగర్ కర్నూల్ జిల్లాలో స్థానిక ఎన్నికల సందడి.. ఆశావాహుల్లో మెుదలైన టెన్షన్!
తెలుగు సినిమా పరిశ్రమలో రచయిత, దర్శకుడు మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ తో పాటుగా.. సంజయ్ దత్త్, నిధి అగర్వాల్, మాలవికా మోహన్ వంటి తారలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హారర్-కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జోనర్ లో రాబోతున్న ఈ సనిమాపై అభిమానుల భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. మరింత ప్రజాదరణ పొందేలా 3డీ వెర్షన్ లో కూడా రాబోతుంది. ఈ సినిమాను 2026 జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా తీసుకురానున్నారు నిర్మాతలు.
Read also-NTR Bharosa Pension: ఎన్టీఆర్ భరోసా పథకం గురించి తెలుసా.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
ట్రైలర ను చూస్తుంటే.. ప్రభాస్ కామెడీ టైమింగ్స్ బాగా కుదిరినట్లు ఉన్నాయి. సైకలాజికల్ హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంది. ఇందులో హీరో ఏదోటి చేసి బాగా హైప్ సాధించాలని చూసే సామాన్యమైన పాత్రలో కనిపిస్తారు. అదే క్రమంలో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనే వ్యక్తిగా ఉండనున్నాడు. ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తున్నారు. రెండో క్యారక్టర్ విలన్ గా కనిసిస్తున్నాడు. ఈ రెండు పాత్రల్లోనూ ప్రభాస్ సమర్థవంతంగా కనిపించారు. హర్రర్ జోనర్ లో ప్రభాస్ కామెడీ టైమింగ్స్ అందరినీ అలరించాయి. సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. థమన్ సంగీతం అందరినీ భయపెట్టేలా ఉంది. ఓవరాల్ గా ఈ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్ కి ఫుల్ మీల్ లా అనిపిస్తుంది.