Director Maruthi: దర్శకులకు క్లాస్‌లు.. రేపు నీ పరిస్థితి ఏంటో?
Director Maruthi (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Director Maruthi: దర్శకులకు ఇలా క్లాస్‌లు ఇస్తున్నావ్.. రేపు నీ పరిస్థితి ఏంటో?

Director Maruthi: డైరెక్టర్ మారుతి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం ఆయన జర్నీనే తెలియజేస్తుంది. ఎక్కడ మారుతి? ఎక్కడ ‘ది రాజాసాబ్’? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas)ని అతి తక్కువ టైమ్‌లోనే డైరెక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకున్న మారుతి.. నిజంగా ఆ సినిమా హిట్ చేయగలిగితే మాత్రం.. ఒక్కసారిగా డైరెక్టర్స్ లిస్ట్‌లో టాప్ రేస్‌కి చేరుకుంటాడు. ఆ తర్వాత ఆయనకు వరసగా స్టార్ హీరోస్ నుంచి పిలుపు వచ్చే అవకాశం లేకపోలేదు. మరోవైపు, ఒకవేళ ఆ సినిమా అటు ఇటు అయితే మాత్రం.. ఎంత ఎదిగాడో అంత పతనం కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో.. కత్తి మీద సాము చేస్తున్నాడు మారుతి (Director Maruthi). ఇలాంటి సమయంలో ఆయన ఇతర దర్శకులకు క్లాస్ ఇవ్వడం గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు.

Also Read- Roshan Kanakala: యానిమల్ కూడా యాక్ట్ చేసింది.. ‘మోగ్లీ 2025’ హార్స్ రైడ్ సీక్వెన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

తప్పులేదు కానీ…

వాస్తవానికి మారుతి చెప్పే దాంట్లో తప్పేం లేదు. ఒక స్టార్ దర్శకుడిగా, ఇతర చిన్న దర్శకులకు జ్ఞానోపదేశం చేయడంలో తప్పులేదు. అందరికీ మంచే చెబుతున్నారు. కానీ, ఇప్పుడాయన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌ను హిట్ చేసి, అప్పుడు మాట్లాడితే బాగుంటుంది.. లేదంటే, ఇప్పుడా దర్శకులు ఫేస్ చేసిన కామెంట్స్‌నే మారుతి కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ‘త్రిబాణధారి బార్బరిక్’ దర్శకుడు మోహన్ శ్రీవత్స (Tribanadhari Barbarik Director Mohan Srivatsa).. తన సినిమాపై ఉన్న నమ్మకంతో.. సినిమా హిట్ కాకపోతే చెప్పుతో కొట్టుకుంటానని, అలాగే చేశాడు. దీనిపై మారుతి తీసుకున్న క్లాస్ గురించి అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా ‘మోగ్లీ 2025’ దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj) కూడా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరలైంది. తన సినిమా విడుదల తదుపరి సంవత్సరంలో అనగానే ఆయన ఎమోషనల్ అవుతూ.. సోషల్ మీడియాలో దురదృష్టవంతుడిని నేనే అంటూ పోస్ట్ పెట్టాడు. దీనిపై కూడా మారుతి క్లాస్ ఇచ్చారు.

Also Read- Pawan Kalyan: మరోసారి గొప్ప మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుకు సాయం

రేపు మన పరిస్థితి ఏంటో..

రీసెంట్‌గా జరిగిన ‘మోగ్లీ’ (Mowgli 2025) ప్రీ రిలీజ్ వేడుకలో మారుతి మాట్లాడుతూ.. ‘‘సందీప్ చాలా టాలెంటెడ్. తన సంకల్పం చాలా గొప్పది. నటసింహం బాలయ్య సినిమాతో పాటు ‘మోగ్లీ’ సినిమా రావడం ఇంకా చాలామందికి ఈ సినిమా ఒకటి వస్తుందని తెలిసింది. ‘శంకర్ దాదా MBBS’ సినిమా వచ్చినప్పుడు ‘ఆనంద్’ కూడా వచ్చింది. అలా వచ్చింది కాబట్టే చాలా మందికి ఆనంద్ గురించి తెలిసింది. ఆ రెండు సినిమాలనూ ప్రేక్షకులు ఆదరించారు. శేఖర్ కమ్ముల మంచి దర్శకుడిగా పేరు పొందారు. బాలయ్య బాబు బ్లెస్సింగ్‌తో సందీప్ ఎదగాలని కోరుకుంటున్నాను. మనం ఎప్పుడు కూడా నెగిటివ్‌గా ఉండకూడదు. అలాంటి పనులు చేయవద్దు. ఇంకా చాలా చూడాలి నువ్వు. అప్పుడే ఎందుకంత ఫ్రస్ట్రేషన్’’ అంటూ సందీప్‌కు మారుతి క్లాస్ ఇచ్చారు. ఇలా అస్తమానం దర్శకులకు క్లాస్‌లు ఇస్తుంటే.. రేపు మన పరిస్థితి ఏంటో కూడా చూసుకోవాలి కదా.. అంటూ మారుతికి నెటిజన్లు కొందరు సలహాలు ఇస్తున్నారు. మరి దీనిని మారుతి ఎలా తీసుకుంటాడో చూడాలి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!