Roshan Kanakala: యంగ్ హీరో రోషన్ కనకాల (Roshan Kanakala) తన రెండవ చిత్రం ‘మోగ్లీ 2025’ (Mowgli 2025)తో వచ్చేందుకు సిద్ధమయ్యారు. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ (Sandeep Raj) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రీమియర్స్ కూడా అద్భుతమైన స్పందన వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 13న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతున్న సందర్భంగా హీరో రోషన్ కనకాల మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
Also Read- Pawan Kalyan: మరోసారి గొప్ప మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుకు సాయం
థియేటర్స్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన కథ
‘‘ఇది ప్యూర్ అండ్ ఇన్నోసెన్స్ లవ్ స్టోరీ. ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదు. అలా డైరెక్టర్ సందీప్ ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే డిజైన్ చేశారు. ఇందులో హానెస్ట్ లవ్ స్టోరీ ఉంది. కామెడీ, యాక్షన్, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. చాలా ఆర్గానిక్‌గా, జెన్యూన్‌గా సందీప్ ఈ కథను రాశాడు. మోగ్లీ తన ప్రేమ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. తన ప్రేమ కథకు వచ్చిన అడ్డు ఎవరు? క్రిస్టఫర్ నోలన్ నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనే కోణంలో ఈ కథ నడుస్తుంది. ఇందులో మోగ్లీ పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. ఆ పాత్రకు అందరూ కనెక్ట్ అవుతారు. ఇది థియేటర్స్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన కథ. ఈ కథ అనుకున్నప్పుడే టైటిల్ కూడా ఫిక్సయ్యాం. ఇది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే కథ. ఇందులో హీరో పాత్రకి ఈ టైటిల్ ఫర్ఫెక్ట్ యాప్ట్. అలాగే ప్రేమ కథ కూడా హెల్ప్ అవుతుంది. ప్రాక్టికల్‌గా చూస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే నేను మాత్రం అన్ని ఎంజాయ్ చేస్తూ చేశాను. చేసే పనిని ప్రేమించి చేశాను. దీంతో అంతా చాలా సరదాగా గడిచింది. 60 శాతం షూటింగ్ ఫారెస్ట్‌లోనే చేశాం. సినిమాలో అన్ని రియల్ లొకేషన్స్ ఉంటాయి. ఈ సినిమా తర్వాత ఫారెస్ట్‌కి చాలా డీప్‌గా కనెక్ట్ అయ్యాం.
Also Read- Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత ఊర మాస్ దర్శకుడితో మహేష్ బాబు మూవీ.. ఫ్యాన్స్‌కి మరో ట్రీట్!
నాతో పాటు యానిమల్ కూడా యాక్ట్ చేసింది
ఇందులో బండి సరోజ్ చాలా పర్ఫెక్ట్ గా సింక్ అయ్యారు. ఆ క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మా మధ్య ఉండే సీన్స్ ప్రేక్షకులకు అద్భుతంగా అనిపిస్తాయి. అలాగే హర్ష కూడా ఇందులో ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్ చేశాడు. ఓవరాల్‌గా సినిమా అంతా ప్రేక్షకులకు గుర్తిండిపోయేలా సందీప్ తెరకెక్కించారు. నేను పర్సనల్‌గా ఎంజాయ్ చేసిన సీన్స్.. అలాగే ఆడియన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారనుకునే సీన్స్ కొన్ని ఇందులో ఉన్నాయి. ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రీ ఇంటర్వెల్ దగ్గర హార్స్ రైడ్ సీక్వెన్స్ ఉంటుంది. అది ఎమోషనల్ సీక్వెన్స్. కచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను ఆ ప్రాసెస్‌ని చాలా ఎంజాయ్ చేశాను. ఒక యానిమల్‌ని తెలుసుకోవడం అనేది నిజంగా సర్‌ప్రైజింగ్ ప్రాసెస్. నేను యాక్ట్ చేస్తుంటే అది కూడా యాక్ట్ చేస్తుంది. అది చూసి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ ఓకే చేశాను. ఒకటి ప్రీ ప్రొడక్షన్ నడుస్తుంది. ఇది ఇంటెన్స్ లవ్ స్టోరీ. మరొక ప్రాజెక్ట్ రొమాంటిక్ కామెడీ. త్వరలోనే ఆ సినిమాల వివరాలను తెలియజేస్తాను’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

