Soundarya Simplicity: 90 వ దశకంలో దక్షిణ భారత దేశంలో అగ్రతారగా ఎదిగిన నటీమణుల్లో సౌందర్య ఒకరు. అయితే ఆమె ఎదిగిన తీరు, ఇతరులతో మాట్లాడే మాట చూస్తే.. భూతద్దం పెట్టి వెతికినా ఒక హేటర్ కూడా ఉండడని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. తాజాగా దర్శకుడు, నటుడు అయిన దేవీ ప్రసాద్ సౌందర్య గురించి మాట్లాడుతూ.. ఇప్పటి వారికి ఆమె గొప్పతనాన్ని మరోక్కసారి గుర్తుచేశారు. ఇప్పుడు హీరోయిన్లు ఒక్క హిట్ పడితే అసలు భూమి ఆగడంలేదు.. అప్పుడు టాప్ హీరోయిన్ అయి ఉండి కూడా ఆమె ఎదుటి వారిపై చూపించిన ప్రేమ, సింప్లిసిటీ గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ఒక సందర్భంలో రంగులు శుభ్రం చేసుకోవాల్సి వస్తే.. ఆమె ఏ మాత్రం చింతించకుండా ఒక పూరింట్లోకి వెళ్లి శుభ్రం చేసుకుని వచ్చారు. ఈ సంఘటన అప్పుడు అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంటూ దేవీ ప్రసాద్ చెబుతుంటే అందుకే అప్పట్లో సౌందర్య టాప్ హీరోయిన్ గా మారారని చెప్పుకొచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read also-Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాపై ఇండస్ట్రీలో బిగ్ బజ్!.. హీరో ఎవరంటే?
సౌందర్య గారిని మొదటిసారి ఒక హోటల్‌లో కథా చర్చలు జరుగుతున్నప్పుడు, రిసెప్షన్‌లో తెల్లటి చుడీదార్ వేసుకుని ఉన్న సౌందర్య గారిని దేవి ప్రసాద్ గారు చూశారు. ఆమెలోని అమాయకత్వం, రూపం చూసి హీరోయిన్‌గా బాగుంటుందని అప్పుడే అనుకున్నారు. చిత్రకారుడు, రచయిత శ్రీనివాస చక్రవర్తి గారి స్నేహితుడి కూతురే సౌందర్య. ఆమె అప్పటికే కన్నడలో ఒక సినిమా చేసి ఉండటంతో, తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘మనవరాలి పెళ్లి’ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారు. సౌందర్య గారు స్టార్ హీరోయిన్ అయినప్పటికీ చాలా సాధారణంగా ఉండేవారని దేవి ప్రసాద్ చెప్పారు. షూటింగ్ సమయంలో క్యారవాన్లు లేని రోజుల్లో, ఒక చిన్న ఇంట్లో రేకులతో ఉన్న బాత్‌రూమ్‌లో స్నానం చేసి వచ్చి మళ్ళీ మేకప్ వేసుకుని షూటింగ్‌లో పాల్గొనేవారట. ఆమె తండ్రి చనిపోయినప్పుడు వారి ఇంటికి వెళ్లినప్పుడు, అక్కడ ఉన్న మధ్యతరగతి బంధువులందరినీ చాలా ఆప్యాయంగా పలకరించడం, ఇంట్లో పనులు చేయడం చూసి దేవి ప్రసాద్ ఆశ్చర్యపోయారు. స్టార్ హీరోయినైనా ఆమె ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ఉండకుండా, హైదరాబాద్‌లోని ‘ప్రశాంత్ కుటీర్’ అనే చిన్న గెస్ట్ హౌస్‌లోనే చివరి వరకు ఉండేవారు. అది ఆమెకు సొంత ఇల్లులా అనిపించేది ఆయన చెప్పుకొచ్చారు.
Read also-Janaki’s Son Passes Away: ప్రముఖ గాయని ఎస్ జానకి కుమారుడు ఇక లేరు.. ఏం జరిగిందంటే?

