Director Apsar: మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని పదే పదే నిరూపిస్తూనే ఉన్నారు. అలాంటి ప్రాజెక్ట్‌ని ఇటీవల ప్రేక్షకులకు అందించారు దర్శకుడు అప్సర్ (Director Apsar). అశ్విన్ బాబు (Ashwin Babu) హీరోగా వచ్చిన ‘శివం భజే’ (Shivam Bhaje) చిత్రం వైవిధ్యమైన కంటెంట్‌తో వచ్చి ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇప్పుడీ సినిమాకు గానూ డైరెక్టర్ అప్సర్ ఓ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు. తాజాగా దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో జరిగిన గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (GAMA) కార్యక్రమంలో మోస్ట్ అస్పైరింగ్ డైరెక్టర్‌గా ‘శివం భజే’ చిత్రానికిగానూ దర్శకుడు అప్సర్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుకు తనని ఎంపిక చేసి, అవార్డు ఇచ్చిన జ్యూరీకి, ఆర్గనైజర్స్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైవిధ్యభరిత సినిమాలకు ఇలాంటి గుర్తింపు దక్కినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Also Read- Little Hearts Hero: ఎప్పుడో, ఎవరినో, ఏదో అన్నానని బాయ్‌కాట్ అంటున్నారు.. అసలు మీరు మనుషులేనా?
నమ్మకం నిలబెట్టిన చిత్రం
‘గంధర్వ’ అనే చిత్రంలో దర్శకుడిగా డిఫరెంట్ ప్రాజెక్ట్‌తో అప్సర్ అందరినీ మెప్పించారు. ఇక అశ్విన్ బాబు హీరోగా వచ్చిన ‘శివం భజే’ మూవీ మరో డిఫరెంట్ టేకింగ్, మేకింగ్‌తో తెరకెక్కించారు. ‘శివం భజే’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న అప్సర్, ఆ సినిమాలో హీరోని చూపించిన తీరుతో తన సత్తా ఏంటో చాటారు. ఆయన మూవీని తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఆయన నమ్మకం నిలబెట్టిన చిత్రంగా ‘శివం భజే’ నిలవడంతో.. ప్రస్తుతం ఆయన డిఫరెంట్ ప్రాజెక్ట్‌ల్ని లైన్‌లో పెట్టబోతున్నట్లుగా తెలిపారు. ఈ అవార్డ్ అందుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Also Read- KA Paul on Kavitha: కవిత ప్రజాశాంతి పార్టీలోకి రావాలి.. మీరేంటో నిరూపించుకోవాలి.. కేఏ పాల్ పిలుపు
ఇకపై మరిన్ని ప్రయోగాలు
‘‘ఇప్పుడు డిఫరెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను. ప్రస్తుతం నేను తెరకెక్కించబోతోన్న చిత్రాల ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఆ సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు వస్తాయి. ఈ లోపు నాకు మోస్ట్ అస్పైరింగ్ డైరెక్టర్‌గా అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో నా తదుపరి ప్రాజెక్ట్స్‌కు వర్క్ చేస్తాను. ప్రేక్షకులను మరింతగా ఎంటర్‌టైన్ చేసేందుకు ప్రయత్నిస్తాను. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన వారికి, అవార్డు ఇచ్చిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమా విషయంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్..’’ అని డైరెక్టర్ అప్సర్ చెప్పుకొచ్చారు. అశ్విన్ బాబు హీరోగా నటించిన ‘శివం భజే’ సినిమాలో దిగంగనా సూర్యవంశీ, ఇనయా సుల్తానా, అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, కిరిటీ దామరాజు వంటి వారు ఇతర పాత్రలలో నటించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు