Dil Raju on OG
ఎంటర్‌టైన్మెంట్

Dil Raju: నైజాంలో లాభాల బాటలో ‘ఓజీ’.. దిల్ రాజు ఆనందానికి అవధుల్లేవ్

Dil Raju: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఓజాస్ గంభీరగా గర్జించిన ‘ఓజీ’ చిత్రం (OG Movie) కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలై.. ఇప్పటికే రూ. 310కి పైగా కోట్లను రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని విధంగా దర్శకుడు సుజీత్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అయ్యారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, సుజీత్ దర్శకత్వ ప్రతిభ, థమన్ (S Thaman) అద్భుతమైన నేపథ్య సంగీతం కలిసి.. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయి చిత్రంగా నిలిపాయి. దాదాపు 12 సంవత్సరాల నుంచి అభిమానులు ఇలాంటి సినిమా కోసం వేచి చూస్తుండటంతో.. ఈ సినిమా సక్సెస్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Also Read- Bhadradri Kothagudem: గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలలో నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు

లాభాల బాటలో..

మరోవైపు ఈ సినిమాపై నెగిటివిటీని స్ప్రెడ్ చేసేవాళ్లు చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఒకవైపు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంటే.., మరోవైపు ఈ సినిమా చాలా ఏరియాలలో లాస్ ప్రాజెక్ట్ అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అందులో నైజాం ఏరియా కూడా ఉంది. కానీ, ఈ సినిమా నైజాంలో లాభాల బాటలో నడుస్తుందని స్వయంగా ఈ సినిమాను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజే చెప్పడంతో ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. తాజాగా ‘ఓజీ’ సక్సెస్‌ని పురస్కరించుకుని ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌కి దిల్ రాజు కూడా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఆయన ఓజీ సినిమా గురించి, కలెక్షన్ల గురించి చెప్పుకొచ్చారు. నైజాంలో ఈ సినిమా బ్రేకీవెన్ సాధించి, లాభాల బాటలో నడుస్తుందని ఆయన చెప్పడంతో ఒక్కసారిగా సంబరాలు అంబరాన్ని అంటాయి. అంతేకాదు, మరో గుడ్ న్యూస్ కూడా దిల్ రాజు ఈ వేడుకలో షేర్ చేశారు. అదేంటంటే..

Also Read- Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కోసం ఆ ఇద్దరు పండిట్స్! థమన్ స్కెచ్ అదిరింది

మరోసారి పవన్ కళ్యాణ్‌తో సినిమా..

‘వకీల్ సాబ్’ తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయబోతున్నట్లుగా దిల్ రాజు ప్రకటించారు. ప్రస్తుతం డిస్కషన్ నడుస్తుందని, పవర్ స్టార్ కూడా ఓకే చెప్పినట్లుగా దిల్ రాజు ఈ వేడుకలో చెప్పుకొచ్చారు. ‘ఓజీ’ సక్సెస్ మీట్‌లో సీక్వెల్ చేయడానికి ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్.. దిల్ రాజుతో కూడా ఓ సినిమా చేయడానికి ఓకే చేశాడనే టాక్ రావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవంటే నమ్మాలి. అలాగే, ఈ విషయం చెబుతూ దిల్ రాజు కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇక పవన్ కళ్యాణ్‌ని నాయకుడిగానే కాకుండా, మధ్య మధ్యలో సినిమాలు కూడా చేయాలని కోరుకునే వారందరికీ దిల్ రాజు మాటలు కొత్త ఉత్సాహాన్ని నింపాయని చెప్పుకోవచ్చు. మరి దిల్ రాజు క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా నైజాం ఏరియాలో ‘ఓజీ’ లాస్ ప్రాజెక్ట్ అని అనడానికి ఇంకా ఎవరు ధైర్యం చేస్తారో చూడాలి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?