Mirai Movie: యువ నటుడు తేజా సజ్జా (Teja Sajja) నటించిన సూపర్ యోధ చిత్రం ‘మిరాయ్’ (Mirai Movie) బాక్సాఫీస్ వద్ద రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతూ, ఈ సీజన్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో, ఈ భారీ విజయాన్ని పురస్కరించుకొని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ‘మిరాయ్’ టీంకి తమ నివాసంలో ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసి అభినందించారు. ఈ వేడుకకు సూపర్ హీరో తేజా సజ్జాతో పాటు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని హాజరయ్యారు. ‘మిరాయ్’ విజయాన్ని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) స్వయంగా తేజా సజ్జాను, కార్తిక్‌ను సన్మానించి, వారి అద్భుతమైన కృషిని ప్రశంసించారు. ఇది కేవలం అభినందన మాత్రమే కాక, పరిశ్రమలోని పెద్దల నుండి లభించిన గొప్ప ప్రోత్సాహంగా భావిస్తున్నామని హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ తెలిపారు.
Also Read- 80s Stars Reunion: 80స్ స్టార్స్ రీయూనియన్ పార్టీలో ఉన్న సెలబ్రిటీలు వీరే..
రికార్డ్ కలెక్షన్స్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. తేజా సజ్జా కెరీర్‌లో వరుసగా రెండోసారి 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రంగా ‘మిరాయ్’ నిలవడం విశేషం. విదేశాల్లోనూ ఈ చిత్రం సత్తా చాటింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి, ఓవర్సీస్ ప్రేక్షకుల్లో తేజా సజ్జాకున్న క్రేజ్‌ను నిరూపించింది. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మనోజ్ మంచు విలన్‌గా మెప్పించారు. వీరితో పాటు శ్రీయా శరణ్, జగపతి బాబు వంటి ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు. యాక్షన్ సన్నివేశాలు, అత్యున్నత స్థాయి విజువల్ ప్రెజెంటేషన్‌తో పాటు బలమైన కథ, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాకు అతి పెద్ద విజయాన్ని చేకూర్చాయి.
Also Read- Mandaadi: సుహాస్ ‘మందాడి’ మూవీ షూటింగ్‌లో ప్రమాదం.. భారీగా నష్టం!
అందరికీ భారీగా లాభాలు
ప్రస్తుతం దసరా సెలవుల నేపథ్యంలో ‘మిరాయ్’ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతూ, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. ఎలాంటి టికెట్ ధరలు పెంచకుండా ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం, ‘మిరాయ్’ చిత్ర బృందం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని, ప్రేక్షకులకు చేరువ చేయాలనే వారి సంకల్పాన్ని స్పష్టం చేసింది. ఈ విజయం యంగ్ హీరో తేజా సజ్జాను బాక్సాఫీస్ వద్ద మరింత డిపెండబుల్ హీరోగా నిలబెట్టింది. ప్రస్తుతం తేజ సజ్జా.. ‘హనుమాన్’ సీక్వెల్ అయిన ‘జై హనుమాన్’ సినిమాలో నటిస్తున్నారు. అనంతరం ‘మిరాయ్’ సీక్వెల్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ‘జాంబిరెడ్డి’ సీక్వెల్ ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
