Dhurandhar OTT: రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రూ. 1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. థియేటర్లలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసిన వారు, థియేటర్లో మిస్ అయిన వారు దీని డిజిటల్ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. జనవరి 30 అర్ధరాత్రి నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. అయితే, సినిమా చూసిన అభిమానులు ఇప్పుడు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read also-Om Shanti Shanti Shanti Review: తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్విటర్ రివ్యూ.. ఎలా ఉందంటే?
సెన్సార్ కోతలపై విమర్శలు
సినిమా స్ట్రీమింగ్ మొదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో నెట్‌ఫ్లిక్స్ తీరుపై విమర్శలు మొదలయ్యాయి. థియేటర్ వెర్షన్ కంటే ఓటిటి వెర్షన్‌లో చాలా మార్పులు ఉన్నాయని ప్రేక్షకులు గమనించారు. ముఖ్యంగా సినిమాలోని ఘాటైన సంభాషణలను మ్యూట్ చేయడం లేదా సెన్సార్ చేయడం అభిమానులకు మింగుడు పడటం లేదు. దీంతో సెన్సార్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
10 నిమిషాల నిడివి మాయం?
అభిమానుల ఆరోపణల ప్రకారం, థియేటర్లలో ఈ సినిమా నిడివి సుమారు 3 గంటల 34 నిమిషాలు ఉంది. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న వెర్షన్ కేవలం 3 గంటల 25 నిమిషాలు మాత్రమే ఉంది. అంటే దాదాపు 10 నిమిషాల నిడివి గల సన్నివేశాలను కత్తిరించారని నెటిజన్లు వాపోతున్నారు. ఓటిటిలో ‘అన్‌కట్ వెర్షన్’ (Uncut Version) వస్తుందని ఆశించిన తమకు ఇది పెద్ద దెబ్బ అని వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అన్ కట్ వర్షన్ వస్తుందని అందరూ ఆశించారు కానీ ఇలా జరగడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read also-Vishwambhara: ‘విశ్వంభర’ మూవీ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన చిరు.. ఎప్పుడంటే?
ఫ్యాన్స్ ప్రశ్నలు
ఈ సందర్భంగా నెటిజన్లు గతంలో విడుదలైన ‘అనిమల్’, ‘కబీర్ సింగ్’ సినిమాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. “అనిమల్, కబీర్ సింగ్ వంటి సినిమాలు ఓటిటిలో ఎటువంటి కోతలు లేకుండా విడుదలైనప్పుడు, ‘ధురంధర్’ కు ఎందుకు సెన్సార్ విధించారు?” అని ప్రశ్నిస్తున్నారు. దీని గురించి సెన్సార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

