Dharma Chakram
ఎంటర్‌టైన్మెంట్

Dharma Chakram: చంద్రబాబు జైలు జీవితంపై ‘ధర్మచక్రం’.. ఇదే లేటెస్ట్ అప్డేట్!

Dharma Chakram: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పై అప్పట్లో రామ్ గోపాల్ వర్మ కొన్ని బయోపిక్‌లను తీసి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ బయోపిక్‌ల వెనుక ఎవరున్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ బయోపిక్‌లపై వర్మ కూడా సైలెంట్ అయ్యాడు. కానీ, వైఎస్ జగన్ సీఎంగా ఉన్న టైమ్‌లో చంద్రబాబుని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు. జైలులో ఆయన పరిస్థితులేంటి? అనే అంశాలపై ఓ సినిమా రాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

తెలుగు రాజకీయ, సినీ రంగాల్లో సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోన్న చిత్రం ‘ధర్మచక్రం’. ఈ సినిమాను నిస్వార్థ సేవా దృక్పథంతో స్థాపితమైన SIFAA సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ అధినేత, గత ముప్పై ఏళ్లుగా సొంత ఖర్చులతో, ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి జరిగిన అన్యాయంపై ‘ధర్మచక్రం’ అంటూ ఓ సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా SIFAA సంస్థ అధికారికంగా ప్రకటించింది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ఆడియోను నందమూరి తారక రామారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ‘మహానాడు’ కార్యక్రమంలో విడుదల చేశారు.

Also Read- Venky vs Nag: వెంకీ, నాగ్ ఫ్యాన్స్ మధ్య వార్.. అస్సలు ఊహించలేదు కదా!

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకటరమణ పసుపులేటి (Venkata Ramana Pasupuleti) మాట్లాడుతూ.. ‘ధర్మచక్రం’ సినిమా చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి, పార్టీ విలువలను కాపాడిన జీవన గాథకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఈ సినిమా ద్వారా ‘నోటు రుచి మరిగిన వారికి పదవులిస్తే ఓటు విలువ తగ్గుతుందనే’ సందేశాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నామని, ధర్మం గెలుస్తుందనే సందేశాన్ని ఇవ్వబోతున్నామని అన్నారు. రాముడుని అడవికి పంపించే వరకు మందర నిద్రపోని విధంగా, ఈ సినిమాను ఆపాలని కొందరు ప్రయత్నిస్తున్నప్పటికీ, ‘ధర్మచక్రం’ సినిమా సూపర్ హిట్ అవుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు చరిత్రకారుడు అవుతారని, అది ‘ధర్మచక్రం’ ఋజువు చేస్తుందని SIFAA సంస్థ ధీమాగా ఉందని తెలిపారు. రాముడు దేవుడయ్యాడు, మందర చరిత్ర హీనురాలైంది. విశ్వ విఖ్యాత నందమూరి తారకరామారావు జన్మదినోత్సవం పురస్కరించుకొని జరిగిన ‘మహానాడు’లో ఈ సినిమా ఆడియో విడుదల కావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా విడుదలకు ముందు జరిగే ప్రమోషన్స్‌ని వినూత్నంగా నిర్వహించాలని SIFAA సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.

Also Read- OG Movie: నారా రోహిత్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అప్డేట్ ఇదే!

ఈ చిత్ర స్టిల్స్ చూస్తుంటే మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా అర్థమవుతోంది. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లి కలవడం, వెంటనే రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించడం వంటి సన్నివేశాలతో పాటు కూటమి కారణమైన ప్రతి అంశాన్ని ఇందులో చూపిస్తున్నట్లుగా ఈ స్టిల్స్ చెప్పేస్తున్నాయి. అంతేకాదు, వైఎస్ జగన్‌పై సెటైరికల్‌గా కొన్ని సన్నివేశాలు ఉంటాయని కూడా తెలుస్తోంది. చూద్దాం.. ఈ సినిమాలో ఉన్న మ్యాటరేంటో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?