Idli Kottu OTT: కోలీవుడ్ స్టార్ హీరో, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ (Dhanush) నటుడిగా ఎంతటి సక్సెస్‌ను చూశారో, దర్శకుడిగా మాత్రం ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో, స్వీయ నిర్మాణంలో వచ్చిన తాజా చిత్రం ‘ఇడ్లీ కొట్టు’ (తమిళంలో ‘ఇడ్లీ కడై’) రీసెంట్‌గా థియేటర్లలో విడుదలై దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుండడం గమనార్హం. అక్టోబర్ 29 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ధనుష్ అభిమానులు, థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే చూసే అవకాశం లభించనుంది.
భారీ పోటీ మధ్యలో విడుదలై..
తమిళంలో ‘ఇడ్లీ కడై’ పేరుతో విడుదలైన ఈ సినిమా తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ (Idli Kottu)గా వచ్చింది. తమిళంలో కాస్త పర్వాలేదనే కలెక్షన్లు సాధించినా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. తెలుగులో ఈ సినిమా ఫెయిల్యూర్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా, రొటీన్ కథాంశం కావడంతో.. ఈ మధ్య కొత్తదనం కోరుకుంటున్న ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. అంతేకాకుండా, ఈ సినిమా విడుదలైన సమయంలో బాక్సాఫీస్ వద్ద బలమైన పోటీ ఎదురైంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ (Pawan Kalyan OG Movie) చిత్రం థియేటర్లలో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుండడం, అలాగే ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) వంటి భారీ సినిమా కూడా పోటీలో ఉండటం వల్ల ‘ఇడ్లీ కొట్టు’కు సరిపడా థియేటర్లు లభించలేదు. థియేటర్లు లభించినా ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు. ఈ బలమైన పోటీని తట్టుకోలేక ఈ సినిమా తెలుగులో దారుణమైన వసూళ్లతో నిరాశపరిచింది.
ఓటీటీలో అయినా ఆదరణ లభిస్తుందా?
మరి థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయిన ‘ఇడ్లీ కొట్టు’, ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. ధనుష్ నటన, ఆయన టేకింగ్‌లోని స్టైలిష్‌నెస్ ఓటీటీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటే, ఈ సినిమా కొంతవరకు హిట్ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 29న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ‘ఇడ్లీ కొట్టు’ హడావిడి ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. నిత్యా మీనన్ (Nithya Menen) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో షాలినీ పాండే (Shalini Pandey) కూడా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆమె కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ, అవి ఏవీ నెరవేరలేదు. కనీసం ఓటీటీలో అయినా మంచి ఆదరణ దక్కితే.. కాస్త టీమ్ ఊపిరి పీల్చుకుంటుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

